సుధీర్-రష్మీల పెళ్లితో తన పెళ్లికి లింక్ పెట్టిన హైపర్ ఆది..లవ్వా, అరేంజ్డా?

వెండితెర మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ప్రభాస్ అని ఠక్కున చెబుతాం. అలానే బుల్లితెర మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే సుధీర్, ప్రదీప్, ఆది పేర్లు చెబుతుంటారు. వీరి పెళ్లిళ్ల గురించి ఇటీవల తెగ వార్తలు వస్తున్నాయి. ఆమెతో పెళ్లి, ఈమెతో పెళ్లి అని ఈరోజు, లేదంటే రేపే వారి పెళ్లి జరగనుందంటూ నెట్టింట అనేక ప్రచారాలు నడుస్తూ ఉంటాయి. రీసెంట్‌గా సుడిగాలి సుధీర్.. తన పెళ్లిపై ఓపెన్ అవుతూ ప్రస్తుతం తనకి పెళ్లిపై ఆసక్తి లేదని తర్వాత ఏమన్నా అటు వైపు గాలి మళ్లితే అప్పుడు చూస్తానని తేల్చి చెప్పాడు. ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాలపైనే ఉందని, హీరోగా నిలబడాలని ఎంతో కృషి చేస్తున్నట్టు చెప్పారు.
అయితే రష్మి, సుధీర్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందనే రూమర్స్ వినిపిస్తుండగా, అవి పట్టించుకోనక్కర్లేదని అవి కేవలం రూమర్స్ అని కూడా సుధీర్ అన్నాడు. అయితే తాజాగా వీరి రిలేషన్‌షిప్‌పై హైపర్ ఆది కూడా స్పందించాడు. యూట్యూబ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుధీర్, రష్మితో లవ్ లో ఉన్నారనే ప్రచారం గురించి మాట్లాడుతూ.. వారిద్దరు ఓ టీవీ షో కోసం అలా చేశారు. ఇద్దరి మధ్య మరేమి లేదన్నట్టు చెప్పిన ఆది తర్వాత వారిద్దరు తొమ్మిదేళ్లు కలిసి ఓకే షో చేశారు. ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ పండింది. అలాంటప్పుడు ఏదో ఉంటుందని, అది వారి వ్యక్తగతమైన విషయమని మళ్లీ అందరిని సస్పెన్స్‌లో పెట్టాడు.
ఇక హైపర్ ఆది తన పెళ్లి గురించి చెబుతూ.. తనకంటే పెద్ద వాళ్లైన సుధీర్, ప్రదీప్ ఉన్నారు . వారిద్దరు పెళ్లి చేసుకున్నాక నేను చేసుకుంటానని చెప్పాడు ఆది. తనని ఇంట్లో ఫోర్స్ చేయడం లేదని, తను ఓ రూట్‌లో వెళుతుండగా, నా ఫ్యామిలీ కూడా నాకు మద్దతుగా ఉన్నారు. పెద్దలు కుదర్చిన పెళ్లి నేను చేసుకుంటాను. గ్లామర్ ఇండస్ట్రీలో చాలా టెంప్టేషన్స్ ఉంటాయని, అవి కామనే అని , ఒక్కో సమయంలో ఒక్కొక్కరిపై ఇష్టం కలుగుతుందని, అవన్నీ పాసింగ్ క్లౌడ్స్ లాంటివంటూ హైపర్ ఆది ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆది టీవీ షోలతో పాటు సినిమాలు, రాజకీయాలతోను బిజీగా ఉన్నారు.