అమ్మాయిని గెలికాడ‌ని హైప‌ర్ ఆదిని జ‌నం చిత‌క్కొట్టారా..ఏం జ‌రిగింది?

అమ్మాయిని గెలికాడ‌ని హైప‌ర్ ఆదిని జ‌నం చిత‌క్కొట్టారా..ఏం జ‌రిగింది?

బుల్లితెర ప్రేక్ష‌కులతో పాటు వెండితెర ప్రేక్ష‌కుల‌కి కూడా హైపర్ ఆది చాలా సుపరిచితం. ఒకప్పుడు జ‌బ‌ర్ధ‌స్త్ షోలోకి రైట‌ర్‌గా అడుగుపెట్టి ఆ త‌ర్వాత టీమ్ లీడ‌ర్‌గా ఎదిగాడు. ఇప్పుడు సినిమాల‌లో కూడా న‌టిస్తున్నాడు. రానున్న రోజుల‌లో రాజ‌కీయాల‌లో కూడా త‌న స‌త్తా చాటాల‌ని భావిస్తున్నాడు. అయితే హైప‌ర్ ఆది ప్ర‌స్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ రియాలిటీ షోలో సందడి చేస్తూ అల‌రిస్తూ ఉండ‌గా, అప్పుడ‌ప్పుడు సినిమాల‌లో మెరుస్తూ ఉంటాడు. దాదాపు 20కి పైగా సినిమాల‌లో ఆది క‌నిపించి మెప్పించాడు. త్వ‌ర‌లో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంతో అల‌రించ‌బోతున్నాడు. అయితే ఆది రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన‌గా ఆ ఇంట‌ర్వ్యూలో త‌న‌కు సంబంధించి జ‌రిగే అనేక ప్ర‌చారాల‌పై పూర్తి క్లారిటీ ఇచ్చాడు.

జోర్దార్ సుజాత హోస్ట్ గా డయల్ న్యూస్ ఛానల్ లో జోర్దార్ పార్టీ విత్ సుజాత పేరుతో ఓ టాక్ షో ప్ర‌సారం అవుతుండ‌గా, ఇందులో సుజాత టాక్ షో ప్ర‌సారం అవుతుంది. ఈ షోకి హైప‌ర్ ఆది గెస్ట్‌గా వచ్చాడు. ఆయ‌నని సుజాత అనే ప్ర‌శ్న‌లు అడ‌గ‌గా, వాటికి ఏ మాత్రం త‌డుముకోకుండా స‌మాధానం ఇచ్చాడు. అయితే ఆదిపై గ‌తంలో కొన్ని ప్ర‌చారాలు సాగేవి. ఓ అమ్మాయిని అల్ల‌రి చేసినందుకు హైప‌ర్ ఆదిని ఒంగోలులో కొట్టిన‌ట్టు రూమ‌ర్స్ వ‌చ్చాయి. దానికి సంబంధించి ఓ ప్ర‌శ్న వేసింది సుజాత‌. అందుకు ఆది అవ‌న్నీ అబ‌ద్ధాలు అని చెప్పుకొచ్చాడు. సాధారణంగా అమ్మాయిల‌తో నేను మ‌ట్లాడ‌డం చాలా త‌క్కువ‌. షోలో కూడా స్కిట్స్ లో భాగంగా అంత‌వ‌ర‌కు వారితో మాట్లాడ‌తాను.

స్కిట్ అయిపోయాక వాళ్లతో పెద్ద‌గా మాట్లాడను. నేను అమ్మాయిని గెలకడం, జనాలు నన్ను కొట్టడం అనేది అంతా ఫేక్ అని, అవి ఎవ‌రో ప‌డ‌ని వారు పుట్టించిన‌వి అన్న‌ట్టు హైప‌ర్ ఆది స్ప‌ష్టం చేశారు. ఆది ప్రకాశం జిల్లా, చీమకుర్తి మండలంలో గల చిన్న గ్రామంలో పుట్టాడు. ఒంగోలు పరిసర ప్రాంతాల్లో చదువుకోగా, ఆ త‌ర్వాత హైద‌రాబాద్‌కి వ‌చ్చి జ‌బ‌ర్ధ‌స్త్ ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు.జ‌నసేన టిక్కెట్ ఇస్తే తాను ఆ పార్టీ ద్వారా ఎంఎల్‌గా పోటీ చేస్తాన‌ని తెలియ‌జేశాడు. ఒక‌వేళ హైప‌ర్ ఆది రాజ‌కీయాల‌లోకి వెళితే ఇటు షోస్ కి, అటు సినిమాల‌కి చెక్ పెడ‌తాడా లేదా అనేది మాత్రం ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్.