తాను సింగిల్ పేరెంట్ కాద‌ని చెబుతూ త‌న బిడ్డ‌కి తండ్రిని ప‌రిచ‌యం చేసిన ఇలియానా

తాను సింగిల్ పేరెంట్ కాద‌ని చెబుతూ త‌న బిడ్డ‌కి తండ్రిని ప‌రిచ‌యం చేసిన ఇలియానా

గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. స్టార్ హీరోల‌తో పాటు యంగ్ హీరోల స‌ర‌స‌న న‌టించి కొద్ది స‌మ‌యంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే కెరీర్ పీక్స్‌లో ఉన్న స‌మ‌యంలో ఈ ముద్దుగుమ్మ చేసిన కొన్ని త‌ప్పుల‌కి కెరీర్ నాశ‌నం అయింది. టాలీవుడ్‌లో ఇలియాని చివరిగా అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో కనిపించింది . కొద్ది రోజుల క్రితం ఇలియానా తాను ప్ర‌గ్నెంట్ అంటూ సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది. అక్టోబర్‌ 1వ తేదీన పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన‌ట్టు పేర్కొంది. ఇక బాబుకు కోవా ఫీనిక్స్‌ డోలన్ అని పేరు పెట్టి అభిమానులకు పరిచయం చేసింది. అయితే బాబు తండ్రి ఎవరు అన్న విషయం మాత్రం కొన్నాళ్లుగా స‌స్పెన్స్‌లో పెట్టింది గోవా బ్యూటీ.

అయితే ఇలియానా అభిమానులు ఆ బాబుకు తండ్రి ఎవరు అన్న విష‌యం తెలుసుకునే ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు.ఆ మధ్య ‘డేట్ నైట్’ అంటూ ఒక వ్యక్తితో ఉన్న ఫోటోలను త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది ఇలియానా. అయితే తన భర్త అని ఆమె నేరుగా చెప్పలేదు కాని కొంత హింట్ అయితే ఇచ్చింది. కాని ఇప్పుడు మాత్రం ఆ వ్య‌క్తే త‌న భ‌ర్త అంటూ తెలియ‌జేసి స‌స్పెన్స్‌కి తెర‌దించింది.తాజాగా నెటిజ‌న్స్‌తో ముచ్చ‌టించిన ఇలియానాని ఓ నెటిజ‌న్.. మీ సింగల్ పేరెంటింగ్ ఎలా ఉంది..? అని ఒక నెటిజెన్ క్యూస్షన్ చేసిన ప్రశ్నకు బదులిస్తూ.. తాను సింగల్ పేరెంట్ కాదని తెలియజేస్తూ తన కొడుకుకి తండ్రి ఇత‌నే అన్న‌ట్టు పిక్ షేర్ చేసింది.

కష్ట స‌మ‌యంలో అతడు తోడుగా నిలిచాడని, అందుకే అత‌డిని పెళ్లి చేసుకున్న‌ట్టు పేర్కొంది. మిచల్‌ డోలన్ అనే వ్యక్తిని ఇలియానా పెళ్లి చేసుకోగా, అత‌డితో ఈ అమ్మ‌డికి ఎలా ప‌రిచ‌యం, అత‌ను ఏం చేస్తాడు వంటి విష‌యాలు మాత్రం ప్ర‌స్తుతం స‌స్పెన్స్‌గానే ఉన్నాయి. ఇక ఇలియానా ప్ర‌స్తుతం మాతృత్వం ఆస్వాదిస్తుంది. రానున్న రోజుల‌లో తిరిగి సినిమాలు చేయాల‌ని అనుకుంటుంది. మ‌రి అమ్మ‌డికి ఇటు తెలుగు, అటు హిందీ భాష‌ల‌లో అవ‌కాశాలు వ‌స్తాయా అనేది చూడాలి.