మూడో రోజు అద్భుతంగా రాణించిన భారత బౌలర్స్.. విజయానికి భారత్ టార్గెట్ ఎంతంటే..!

రాంచీ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ ఆసక్తికరంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఆల్‌రౌండ్ షోతో టీమిండియ మూడో రోజు ఆటలో భారత్ పైచేయి సాధించింది అని చెప్పాలి. ఆదివారం ఆట ముగిసేసరికి టీమిండియా 8 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. విజయానికి మరో 152 పరుగుల దూరంలో ఉండగా, ప్రస్తుతం క్రీజులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (24; 27 బంతుల్లో), యశస్వీ జైస్వాల్ (16; 21 బంతుల్లో) ఉన్నారు. నాలుగో మ్యాచ్ మూడో రోజైన ఆదివారం మూడో సెషన్ లో భారత్ త్వరగానే ఆలౌట్ అయింది. వికెట్ కీపల్ జురేల్ 90 పరుగులు చేయడంతో 307 పరుగులకి ఆలౌట్ అయింది. జురేల్‌కి కుల్దీప్ చక్కని సహకారం అందించాడు. ఇక భారత్ ఆలౌట్ అయిన తర్వత ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది.
రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ తరపున జాక్ క్రాలే అత్యధికంగా 60 పరుగులు చేశాడు. జాక్ క్రాలే (60; 91 బంతుల్లో) టాప్ స్కోరర్ గా నిలవగా, ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్స్‌ని అశ్విన్ దెబ్బ కొట్టాడు. వరుస బంతుల్లో వరుస బంతుల్లో బెన్ డకెట్ (15; 15 బంతుల్లో), ఒలీ పోప్ (0; 1 బాల్)ను ఔట్ చేశాడు. కాసేపటికే ప్రమాదకర బ్యాటర్ జో రూట్ (11; 34 బంతుల్లో)ను అశ్విన్ వికెట్ల ముందు అశ్విన్ బౌలింగ్‌లో అడ్డంగా దొరికిపోయాడు. మరోవైపు . కుల్‌దీప్ యాదవ్ కూడా చెలరేగడంతో ఇంగ్లండ్ జట్టు వెంటవెంటనే వికెట్స్ కోల్పోయింది. జానీ బెయిర్‌స్టో (30; 42 బంతుల్లో) ఔట్ కాగా, . ఆ తర్వాత కుల్‌దీప్ ఒకే ఓవర్‌లో టామ్ హర్ట్‌లీ (7; 25 బంతుల్లో), రాబిన్సన్ (0, 3 బంతుల్లో) వెంటవెంటనే ఔట్ చేశాడు.
ఆ తర్వాత ఫోక్స్ (17;76 బంతుల్లో) జాగ్రత్తగా ఆడిన కూడా త్వరగానే ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో షోయబ్ బషీర్ నాటౌట్‌గా నిలిచాడు. భారత్ తరపున ఆర్ అశ్విన్ 5 వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ నాలుగు విజయాలు అందుకున్నాడు. రవీంద్ర జడేజాకు ఒక వికెట్ దక్కింది.ఇక మూడో రోజైన ఆదివారం ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. మ్యాచ్, సిరీస్‌ల విజయానికి జట్టు 152 పరుగుల దూరంలో ఉంది. ప్రస్తుతం రోహిత్ శర్మ( 24 నాటౌట్), యశస్వి జైస్వాల్( 16 నాటౌట్) పరుగులు చేసి క్రీజులో ఉన్నారు.ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత్‌కి టోర్నీ వశం అవుతుంది.