Janhvi Kapoor | దేవరతో కలిసిన తంగం..! గోవా షెడ్యూల్‌లో చేరిన జాన్వీకపూర్‌..!

Janhvi Kapoor | దేవరతో కలిసిన తంగం..! గోవా షెడ్యూల్‌లో చేరిన జాన్వీకపూర్‌..!

Janhvi Kapoor | ఎన్టీఆర్‌ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిత్రం దేవర. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. రెండు పార్టులగా రానున్నది. ఈ ఏడాది అక్టోబర్‌ 10న దేవర తొలి భాగం ప్రేక్షకుల ముందుకు రానున్నది. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతున్నది. గోవాలో ఏర్పాటు చేసి ప్రత్యేక సెట్‌లో షూటింగ్‌ కొనసాగుతున్నది. సాంగ్‌తో పాటు కీలకమైన యాక్షన్‌ సీన్లను తెరకెక్కిస్తున్నారు. ఇటీవల చిత్రబృందం ఎన్టీఆర్‌ వర్కింగ్‌ స్టిల్స్‌ రిలీజ్‌ చేయగా.. సినిమాపై అంచనాలు భారీగా పెంచాయి. సముద్రంలో ఎన్టీఆర్‌ నడుచుకుంటూ వస్తున్న వీడియో లీక్‌ అయిన విషయం తెలిసిందే. ఈ వీడియో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ మూవీలో జాన్వీ కపూర్‌ ‘తంగం’ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జాన్వీ లుక్‌ను విడుదల చేయగా.. పల్లెటూరి అమ్మాయిగా లుక్‌ అదిరిపోయింది. తాజాగా జాన్వీ గోవా షెడ్యూల్‌లో జాయిన్‌ అయ్యింది.

ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ తెలిపింది. ఎన్టీఆర్‌, జాన్వీ మధ్య కీలక సన్నివేశాలతో పాటు సాంగ్‌ను సైతం షూట్‌ చేయనున్నట్లు సమాచారం. దేవర మూవీ యాక్షన్, రొమాంటిక్ ఎంటర్‌టైన్‌గా తెరకెక్కుతుండగా.. ఎన్టీఆర్, జాన్వీ కపూర్, శ్రుతి మరాఠే కీలకపాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ భైర అనే విలన్‌పాత్రలో నటిస్తున్నారు. దర్శకత్వం కొరటాల శివ వహిస్తుండగా నందమూరి కల్యాణ్‌రామ్‌ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్‌ నేతృత్వంలోని యువసుధ ఆర్ట్స్‌, కొసరాజు హరికృష్ణ అధ్వర్యంలోని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై తెరకెక్కతున్నది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. అలనాటి అందాల తార శ్రీదేవి ముద్దుల తనయ అయిన జాన్వీకి తెలుగులో ఇదే తొలిచిత్రం కావడం విశేషం. ఈ క్రమంలో ఎన్టీఆర్‌-జాన్వీ కాంబోలో వస్తున్న చిత్రం ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.