ఏంటి.. దేవర సినిమాలో జాన్వీ కపూర్ కట్టుకున్న చీర వెనుక ఇంత కహానీ ఉందా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి సంబంధించి మేకర్స్ అప్పుడప్పుడు ఒక్కో అప్‌డేట్ ఇస్తూ ఫ్యాన్స్‌ని ఫుల్ ఖుషీ చేస్తున్నారు. అయితే జాన్వీ కపూర్ బర్త్‌డే సందర్భంగా దేవర టీమ్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ అందించారు మేకర్స్. జాన్వీ కపూర్‌కి సంబంధించిన ప్రత్యేకంగా ఓ పోస్టర్ రిలీజ్ చేయగా, ఇందులో జాన్వీ ట్రెడిషనల్ లుక్‌లో అదిరిపోయింది. చీరకట్టులో జాన్వీ కపూర్‌ని చూసి థ్రిల్ అవుతున్నారు ఫ్యాన్స్.
తంగం అనే పాత్రలో జాన్వీకపూర్ కనిపించబోతుండగా, ఈ సినిమాతోనే జాన్వీకపూర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుండడం విశేషం. అయితే జాన్వీ కపూర్ లుక్ విడుదలైన తర్వాత ఆమె పాత్రపై ఒక్కొక్కరిలో అనేక అనుమానాలు ఏర్పడ్డాయి. చీరకట్టులో లుక్ అదిరిపోగా, ఆమె కట్టుకున్న చీర శ్రీదేవిది అంటూ ఓ వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో జాన్వీ కపూర్ పెద్ద హీరోయిన్ కావాలి అని, తన తల్లి ఆశీస్సులు తనకు ఉండాలి అని బావించింది తన తల్లి చీరతో ఒక సాంగ్‌లో జాన్వీ కపూర్ నటించినట్టు ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజమెంత ఉందనేది చూడాల్సి ఉంది.
దేవర సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంతుండగా, తొలి పార్ట్‌ను ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలని భావించారు. కాని షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో దసరా కానుకగా అక్టోబర్ 10న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. రెండో పార్ట్ వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది.దేవర మూవీలో తీర ప్రాంతాల ప్రజలకు అండగా నిలబడే ఓ నాయకుడిగా ఎన్టీఆర్ కనపించనుండగా, ఆయన ప్రేయసిగా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఇక ప్రతి నాయకుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించి సందడి చేయనున్నారు. చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ మంచి బాణీలు సమకూరుస్తున్నారు.