భ‌ర్త ఆత్మ‌హ‌త్య గురించి జ‌య‌సుధ‌కి ముందే తెలుసా..మూడో పెళ్లిపై జ‌య‌సుధ ఒపీనియ‌న్ ఏంటంటే..!

  • By: sn    breaking    Mar 04, 2024 12:25 PM IST
భ‌ర్త ఆత్మ‌హ‌త్య గురించి జ‌య‌సుధ‌కి ముందే తెలుసా..మూడో పెళ్లిపై జ‌య‌సుధ ఒపీనియ‌న్ ఏంటంటే..!

స‌హ‌జ నటి జ‌య‌సుధ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఒక‌ప్పుడు క‌థానాయిక‌గా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించిన జ‌య‌సుధ ఇప్పుడు స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్‌లో మెరుస్తుంది… 16 ఏళ్ల వయసు నుంచే నటిగా మారి ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌తో పాటు ఎంతో మంది సీనియ‌ర్ హీరోల‌తో క‌లిసి ప‌ని చేసింది. అయితే జ‌య‌సుధ ప‌ర్స‌న‌ల్ లైఫ్ మాత్రం నిత్యం వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. మొదట కాకర్లపూడి రాజేంద్రప్రసాద్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న జ‌య‌సుధ‌ 1982లో అత‌నితో విడిపోయింది. మూడేళ్ల తర్వాత నిర్మాత నితిన్‌ కపూర్‌ని ప్రేమ వివాహం చేసుకుంది. 2017 వరకు ఇద్ద‌రు క‌లిసి అన్యోన్యంగా ఉండేవారు. కాని ఏం జ‌రిగిందో ఏమో కాని ఆయన ఆత్మహత్య చేసుకోవ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

ఏడేళ్ల క్రితం అప్పుల బాధ తట్టుకోలేక జ‌య‌సుధ భ‌ర్త ఆత్మహత్య చేసుకున్నాడ‌ని జోరుగా వార్త‌లు రాగా, దానిపై ఇప్ప‌టి వ‌రకు జ‌య‌సుధ స్పందించింది లేదు. తాజాగా దీనిపై ఓ ఇంట‌ర్వ్యూలో జ‌య‌సుధ మాట్లాడుతూ.. నితిన్‌ కపూర్‌ ఆత్మహత్యకు తాను కారణం కాదని చెప్పిన జ‌య‌సుధ‌.. తాను నిర్మించిన సినిమాల వ‌ల‌న ఆయ‌న న‌ష్టాలు చవిచూశాడ‌నేది అవాస్త‌వం. ఆయ‌నకి అప్పులు పెద్ద స‌మ‌స్యే కాదు. అప్పుల వ‌ల‌న ఆయ‌న ఆత్మ‌హ‌త్య చేసుకునే మ‌నిషి కాదు. కాక‌పోతే తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంటాడ‌ని త‌న‌కి ముందే తెలుస‌ని జ‌య‌సుధ వెల్ల‌డించింది. వారి కుటుంబంలో త‌న అన్న, అత్తగారి ఫ్యామిలీలో ఇద్దరు ఆడపడుచులు కూడా ఇలానే ఆత్మహత్య చేసుకున్నారని, ఏదైనా ప్రెజర్‌గా అనిపిస్తే వాటిని హ్యాండిల్ చేయ‌లేక ఇలా సూసైడ్ చేసుకుంటార‌ని , ఇలా సూసైడ్ చేసుకోవ‌డం ఎప్పటి నుండో వ‌స్తుంద‌ని జ‌య‌సుధ పేర్కొంది.

ఇంట్లో సమస్యలు చాలా రోజులుగా న‌డుస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఆయ‌న సూసైడ్ చేసుకుంటాడ‌నే సూచ‌న‌లు క‌నిపించాయి. అయితే ఆయ‌న‌ని మేము చాలా కాపాడుకుంటూ వ‌చ్చాం. కాక‌పోతే మేము లేని స‌మ‌యంతో ఆయ‌న సూసైడ్ చేసుకొని షాకిచ్చాడు అని జ‌య‌సుధ పేర్కొంది. వారి ఫ్యామిలీలో ఉన్న సైకలాజిక‌ల్ స‌మ‌స్య వ‌ల్ల‌నే ఆయ‌న చనిపోయారు త‌ప్ప ఇంట్లో సమస్యలు కాని, అప్పులు గానీ కారణం కాదని వెల్లడించింది జయసుధ. మరోవైపు మూడో పెళ్లిపై మాత్రం తాను స్పందించని కార‌ణంగా రాసుకునే వాళ్లు ఏదో రాసుకుంటారని, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని జ‌య‌సుధ స్ప‌ష్టం చేసింది.