తెలుగు సినిమాలపై ఎన్నికల ఎఫెక్ట్.. ప్రభాస్ కల్కి చిత్రం మరోసారి వాయిదా పడబోతుందా?

ఇండియాలో ఎన్నికల నగారా మోగింది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల తేదీలను మార్చి 16న ఈసీ ప్రకటించింది. ఈ క్రమంలో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా, ఏప్రిల్ 19న తొలివిడత పోలింగ్ జరుగుతుంది. ఇక చివరి విడత జూన్ 1న తేదీన జరగనుంది. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మే 13వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. వీటి ఫలితాలు జూన్ 4వ తేదీన విడుదల కానున్నాయి. అయితే ఎలక్షన్స్ తేదీల ప్రకటనతో ఇప్పుడు సినిమాల రిలీజ్ డేట్స్ కూడా మారతాయనే టాక్ వినిపిస్తుంది. సాధారణంగా సమ్మర్‌లో పెద్ద హీరోల సినిమాలు ఎక్కువగా విడుదల అవుతుంటాయి.
ఏప్రిల్ నెలాఖరుకి అందరి ఎగ్జామ్స్ పూర్తి అవుతాయి కాబట్టి ఇక ఫ్యామిలీ అంతా సినిమాలకి వెళ్లి హాయిగా ఎంజాయ్ చేస్తుంటారు. అందుకే సమ్మర్‌లో స్టార్ హీరోల సినిమాలన్నీ క్యూ కడుతుంటాయి. ఇప్పటికే పలు సినిమాల రిలీజ్ డేట్స్ ప్రకటించగా, ఎన్నికల తేదీ ప్రకటన వాటి తేది మారుతుందని అంటున్నారు. సమ్మర్‌లో వినోదాన్ని పంచేందుకు విజయ్ దేవరకొండ సిద్ధమయ్యాడు. ఆయన నటించిన ఫ్యామిలీ మ్యాన్ ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత ఏప్రిల్ 12న విక్రమ్ తంగలాన్ రిలీజ్ కానుంది. ఇక సుహాస్ శ్రీరంగనీతులు కూడా ఏప్రిల్ 19కి ముందే రిలీజ్ అయిపోతుంది.
ఏప్రిల్ 19వ తేదీన ఎన్నికల జాతర మొదలయ్యాక కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ రత్నం చిత్రంతో ప్రేక్షకులని పలకరించనున్నాడు.. ఏప్రిల్ 26న ఇది రిలీజ్ కానుంది. అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు మూవీ కూడా అదే వారంలో రిలీజ్ అవుతుంది.ఇక ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి మే 9వ తేదీన థియేటర్లలోకి రావాలి. కల్కి చిత్రం దేశ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఎన్నికల ప్రభావం ఈ మూవీపై పడుతుందని బావిస్తున్న నిర్మాతలు మళ్లీ మూవీని వాయిదా వేసే అవకాశం ఉంది. జూన్ 4వ తేదీన కౌంటింగ్ పూర్తైన తర్వాత రామ్ డబుల్ ఇస్మార్ట్, అల్లు అర్జున్ పుష్ప-2, నాని సరిపోదా శనివారం, పవన్ ఓజీ, ఎన్టీఆర్ దేవర, నాగ చైతన్య తండేల్ చిత్రాలు ప్రేక్షకులని అలరించేందుకు వరుసగా క్యూ కడతాయి. ఎన్నికలో సీజన్‌లో వచ్చే కల్కి మాత్రంపై కొంత అనుమానాలు ఉన్నాయి.