కీర్తి సురేష్ హ‌వా చూశారా.. ఇప్పుడు అన్ని భాష‌ల‌ని దున్నేస్తుందిగా..!

కీర్తి సురేష్ హ‌వా చూశారా.. ఇప్పుడు అన్ని భాష‌ల‌ని దున్నేస్తుందిగా..!

మ‌హాన‌టి కీర్తి సురేష్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మ‌హాన‌టి చిత్రంతో ఫుల్ క్రేజ్ అందుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ ఇప్పుడు వ‌రుస అవ‌కాశాలు ద‌క్కించుకుంటూ దూసుకుపోతుంది. ఒక్క తెలుగులోనే కాదు త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల‌లోను ఈ అమ్మ‌డికి అవ‌కాశాలు బాగానే వ‌స్తున్నాయి. తమిళంలో ఈ ముద్దుగుమ్మ నాలుగు సినిమాల్లో న‌టిస్తూ ఉండ‌గా, ఆమె న‌టించిన ‘సైరెన్’ చిత్రం ఇప్పుడు రిలీజ్ కు సిద్ధం అవుతోంది. కోలీవుడ్ స్టార్ జయం రవి హీరోగా నటించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా కీరోల్ పోషించ‌గా, ఇందులో అనుపమా పరమేశ్వరన్ కూడా ముఖ్య పాత్ర‌లో నటిస్తోంది.

ఇక కీర్తి నటిస్తున్న మరో ప్రాజెక్ట్ ‘రఘు తాత’ కాగా, ఈ మూవీని ‘కేజీఎఫ్’ నిర్మాతలు హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. విమెన్ రైట్స్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి సుమన్ కుమర్ దరక్శత్వం వహించారు. లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేయ‌డం కీర్తి సురేష్‌కి కొత్త కాదు ఇప్పుడు `రివాల్వర్‌ రీటా` అనే చిత్రంతో స‌రికొత్త ప్ర‌యోగం చేసేందుకు సిద్ధ‌మైంది. వింటేజ్‌ కథతో రాబోతున్న ఈ చిత్రానికి కె చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. ది రూట్, ప్యాషన్‌ స్టూడియో పతాకాలపై జగదీష్‌ నిర్మిస్తుండ‌గా, ఈ మూవీ కూడా అత్యంత ప్రతిష్టాత్మ‌కంగా రూపొందుతుంది. మరోవైపు ఈ భామ గ‌ణేష్ రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో కన్నివేడి మూవీ చేస్తుంది. ప్ర‌స్తుతం ఈ మూవీ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.

సౌత్‌లో స‌త్తా చాటుతున్న ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్‌పై కూడా ఫోక‌స్ పెట్టింది. ఆ భాష‌లో కూడా వ‌రుస అవ‌కాశాలు ద‌క్కించుకుంటుంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ స‌ర‌స‌న న‌టిస్తుండ‌గా, ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ జ‌రుపుకుంటుంది. హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు అట్లీ డైరెక్ష‌న్‌లో ఈ మూవీ రూపొందుతుంది. ఇక యష్ రాజ్ థ్రిల్లర్ లో ‘అక్క’ వెబ్ సిరీస్ రూపొందుతుండ‌గా, ఇందులో రాధికా ఆప్టేతో క‌లిసి సంద‌డి చేయ‌నుంది. ఈ వెబ్ సిరీస్‌పై బోలెడ‌న్ని అంచ‌నాలు ఉన్నాయి. బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టేతో క‌లిసి ఎలాంటి ర‌చ్చ చేయ‌నుంద‌ని అంద‌రు ముచ్చ‌టించుకుంటున్నారు. మొత్తానికి కీర్తిసురేష్ సౌత్‌తో పాటు బాలీవుడ్‌ని దున్నేసే ప్లాన్‌లో ఉంది.