Viral Video | ఆడి కారులో వచ్చి.. తోటకూర అమ్మిన రైతు

Viral Video | రైతులు సాధారణంగా కాలినడకనో లేదా ఎడ్ల బండిపైన మార్కెట్‌కు కూరగాయలు తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. అప్పుడప్పుడు ఆటోలను కూడా ఆశ్రయిస్తుంటారు. కానీ ఈ రైతు మాత్రం ఏకంగా ఆడి కారులో ఆకుకూరలను మార్కెట్‌కు తీసుకొచ్చి అమ్మాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
కేరళకు చెందిన సుజిత్ అనే ఓ యువ రైతు తనకున్న పొలంలో ఆకుకూరలను పండిస్తున్నాడు. ఇక తాజా ఆకుకూరలను ఎప్పటికప్పుడు మార్కెట్‌కు తీసుకొచ్చి విక్రయిస్తుంటాడు. అయితే అదేదో ఆటోలో కాదు.. ఆడి కారులో సుజిత్ మార్కెట్‌కు వస్తుంటాడు. ఇక రోడ్డు పక్కనే ఆకుకూరలు విక్రయించి వెళ్లిపోతుంటాడు.
ఈ యువ రైతు వెరైటీ ఫార్మర్ అనే పేరుతో ఇన్‌స్టా గ్రామ్‌లో వీడియోలను అప్‌లోడ్ చేస్తుంటాడు. తాజాగా ఓ వీడియోను అప్‌లోడ్ చేశాడు సుజిత్. తోటకూరను మార్కెట్‌కు తీసుకొచ్చిన సుజిత్.. ఆడికారులో వచ్చాడు. రాగానే చెప్పులు, పంచె విప్పేసి.. కారులో పెట్టేశాడు. అనంతరం తోటకూరను అమ్మేశాడు. సుజిత్ రైతుగా మారేకంటే ముందు క్యాబ్ డ్రైవర్‌గా పని చేశాడు. మొత్తానికి వ్యవసాయంలో మెలకువలు నేర్చుకున్న సుజిత్.. ఆకుకూరలు అమ్మి డబ్బు సంపాదించాడు. ఆడి కారు కొన్నాడు. ఇప్పుడు రైతులకు పాఠాలు బోధించే స్థాయికి చేరుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో ఎప్పటికప్పుడు వ్యవసాయానికి సంబంధించిన కొత్త వీడియోలను అప్‌లోడ్ చేస్తూ.. రైతులకు ఓ బాటసారిగా మారాడు సుజిత్.