పెళ్లైనప్ప‌టికీ ప‌రేషాన్ చేస్తున్న మ‌హేష్ బ్యూటీ.. ఏంటి ఆ గ్లామ‌ర్ షో…!

  • By: sn    breaking    Feb 26, 2024 12:02 PM IST
పెళ్లైనప్ప‌టికీ ప‌రేషాన్ చేస్తున్న మ‌హేష్ బ్యూటీ.. ఏంటి ఆ గ్లామ‌ర్ షో…!

ద‌క్షిణాది ప‌రిశ్ర‌మ‌లో మంచి డిమాండ్ ఉన్న భామ‌ల‌లో కియారా అద్వాని కూడా ఒక‌రు. ఈ అమ్మ‌డు తెలుగులో కూడా ప‌లు సినిమాలు చేసి మెప్పించింది. మ‌హేష్ బాబుతో క‌లిసి భ‌ర‌త్ అనే నేను సినిమాలో న‌టించిన మ‌హేష్ బాబు రామ్ చ‌రణ్‌తో విన‌య విధేయ రామ అనే చిత్రం కూడా చేసింది. ఇక ఇప్పుడు మ‌రోసారి చ‌ర‌ణ్‌తో క‌లిసి గేమ్ ఛేంజ‌ర్ అనే మూవీ చేస్తుంది. దీంతో పాటుబాలీవుడ్‌లో భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ఇటీవలే హృతిక్ రోషన్ , ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న వైఆర్ఎఫ్‌ స్పై సిరీస్‌లో భాగమైన వార్ 2కి సంతకం చేసింది. ఈ సినిమాలో కియారా పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంద‌ని అంటున్నారు.

కియారా త‌న కెరీర్‌లో భిన్న‌మైన పాత్ర‌లు పోషించిన కూడా ఇప్పటివరకూ చేయని భిన్నమైన పాత్రను చేసే పనిలో ఉన్నది. కియారా నటిస్తున్న చిత్రాల్లో ప్రతిష్టాత్మక చిత్రంగా ‘డాన్‌3’మూవీ గురించి చెప్పాలి. డాన్ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందుతున్న ఈ సినిమాలో కథానాయకుడిగా రణ్‌బీర్‌సింగ్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కియారా యాక్ష‌న్ సీన్స్ చేయ‌నుంద‌ట‌. ఇందుకోసం ప్ర‌త్యేక శిక్ష‌ణ కూడా తీసుకుంటుంద‌ట‌. ఇక ఈ అమ్మ‌డు సిద్ధార్థ్‌తో సీక్రెట్‌గా ఐదారేళ్లపాటు ప్రేమాయ‌ణం న‌డిపి ఎట్ట‌కేల‌కి పెళ్లి చేసుకుంది. ఇటీవ‌ల తాను త‌ల్లి కాబోతున్న‌ట్టుగా కొంద‌రు ప్ర‌చారాలు చేశారు.కాని ఆ వార్త‌ల‌ని కొంద‌రు కొట్టి ప‌డేశారు.

అయితే పెళ్లైన త‌ర్వాత కూడా కియారా త‌న గ్లామ‌ర్‌తో మ‌త్తెక్కిస్తూనే ఉంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న క్యూట్‌నెస్‌తో మ‌త్తెక్కిస్తుంది. కియారా గ్లామ‌ర్ షో చూసి ప్ర‌తి ఒక్క‌రు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. ఏంటి పెళ్లైన ఈ అమ్మ‌డు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదంటూ షాకింగ్ కామెంట్ చేస్తున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త అందాల‌ని ప్ర‌ద‌ర్శిస్తూ ఇలా ర‌చ్చ చేయ‌డం చూసి ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఏదేమైన పెళ్లైన‌ప్ప‌టికీ కియారా జోరు ఏ మాత్రం త‌గ్గ‌క‌పోవ‌డం నిజంగా షాకింగ్ అని అంటున్నారు. కెరీర్ ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నప్పుడు అమ్మడు పెళ్లి పీఠలెక్కేసింది. చాలా కాలంగా యంగ్ హీరో సిద్ధార్థ మల్హోత్రాతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన కియారా అద్వానీ.. చివ‌రిగా గ‌త ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంది. జైపూర్‌లోని ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా వీళ్ల పెళ్లి జరిగింది.ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కూడా వీరి పెళ్లిలో సంద‌డి చేశారు.