Kriti Sanon | పదేళ్ల చిన్నవాడితో కృతి సనన్‌ డేటింగ్‌..! చేతిలో చేయివేసి లండన్‌ వీధుల్లో చెట్టాపట్టాల్‌..!

Kriti Sanon | పదేళ్ల చిన్నవాడితో కృతి సనన్‌ డేటింగ్‌..! చేతిలో చేయివేసి లండన్‌ వీధుల్లో చెట్టాపట్టాల్‌..!

Kriti Sanon | బాలీవుడ్‌ బ్యూటీ కృతి సనన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరుస చిత్రాలు చేస్తూ జోరు కొనసాగిస్తున్నది. చివరిసారిగా వెండితెరపై ‘తేరి బాతో మే ఐసా ఉల్జా జియా’ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం క్రూ చిత్రంలో నటించింది. ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో టబు, కరీనా కపూర్‌ ఖాన్‌తో కలిసి స్క్రీన్‌ను పంచుకోనున్నది. ఇదిలా ఉండగా.. బ్యూటీ పర్సనల్‌ లైఫ్‌కి సంబంధించిన ఓ వార్త బాలీవుడ్‌లో వైరల్‌గా మారింది. ఇటీవల లండన్‌కు వెళ్లిన కృతి సనన్‌ ఓ వ్యక్తితో కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. ఓ వ్యక్తి చేతిలో చేసి వేసి నడుస్తున్న ఫొటోలు కనిపించగా.. ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే ఊగాహానాలు జోరందుకున్నాయి. సదరు వ్యక్తి కబీర్‌ బహియాగా తెలుస్తున్నది. కృతి చేతిలో చేసి వేసి లండన్‌ వీధుల్లో తిరుగుతున్న ఫొటోలు వైరల్‌గా మారాయి. కబీర్ బహియా బాలీవుడ్ ప్రముఖుల ఫంక్షన్లలో కనిపిస్తుంటాడు.

యూకేకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త తనయుడు. కబీర్‌ బహియా టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీకి బంధువుని.. ధోని భార్య సాక్షి తరఫున బంధువులని తెలుస్తున్నది. అయితే, కబీర్‌ బహియా వయసు 23 సంవత్సరాలు కాగా.. కృతి సనన్‌ వయసు 33 సంవత్సరాలు. తనకంటే పదేళ్లు చిన్నవాడైన కబీర్‌ బహియాతో డేటింగ్‌లో ఉన్నట్లు బీటౌన్‌ కోడై కూస్తున్నది. ఇందులో ఎంత వరకు వాస్తవమన్నది తెలియాల్సి ఉంది. కృతి సనన్‌ ఇంతకు ముందు యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాత్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, వార్తలను ఆదిపురుష్‌ జోడి కొట్టిపడేసింది. ఇదిలా ఉండగా.. కృతిసనన్‌ రెండు సినిమాల్లో నటిస్తున్నది. ఇందులో ఒకటి ‘క్రూ’ మూవీ ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానున్నది. చిత్రంలో టబు, కరీనా కపూర్‌ కీలకపాత్రలు పోషిస్తుండగా.. రాజేశ్‌ కృష్ణన్‌ దర్శకత్వం వహించారు. రియా కపూర్, ఏక్తా కపూర్, అనిల్ కపూర్, దిగ్విజయ్ పురోహిత్ నిర్మించారు.