కేటీఆర్‌ని ఇంటర్వ్యూ చేయనున్న రానా, విజయ్ దేవరకొండ.. ఇప్పుడంతా దీని గురించే చర్చ..!

ఇటీవల సెలబ్రిటీలు నటులిగానే కాదు హోస్ట్‌లుగా అవతారం ఎత్తి ప్రేక్షకులకి పసందైన వినోదం పంచుతున్నారు. నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ, నాని, జూనియర్ ఎన్టీఆర్ వంటి వారు హోస్ట్‌గా ఎంత సందడి చేసారో మనం చూశాం. బాలయ్య అన్‌స్టాపబుల్ షోతో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు ఆయనకి పోటీగా రానా, విజయ్ దేవరకొండ సరికొత్త షోతో ప్రేక్షకులని ఎంటర్‌టైన్ చేయనున్నారని తెలుస్తుంది. రానా,విజయ్ దేవరకొండకి తెలుగు రాష్ట్రాలలో మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో వారిద్దరి క్రేజ్‌ని ఉపయోగించుకొని ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.మరి సడెన్‌గా ఈ ఇద్దరు కలిసి ఇంటర్వ్యూ చేయడమేంటనే ఆలోచన అందరిలో మొదలైంది.
ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి జరుగుతున్న నేపథ్యంలో పలు పార్టీలు ఏదో రకంగా జనాల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఎలక్షన్ కాంపెయిన్ కోసం నానా పాట్లు పడుతున్నారు. కేటీఆర్ ఇటీవల గంగవ్వతో కలిసి ప్రత్యేకమైన షో చేశాడు. దీనికి సూపర్భ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు రానా, విజయ్ దేవరకొండతో కలిసి తెలంగాణ మంత్రి కేటీఆర్ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ప్లాన్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రానా, విజయ్ కలిసి కేటీఆర్ ని ఇంటర్వ్యూ చేయబోతున్నారని కొందరు అంటుంటే, మరి కొందరు ఆల్రెడీ షూటింగ్ కూడా పూర్తి అయ్యిందని అంటున్నారు. దీనిపై అయితే క్లారిటీ రావలసి ఉంది.
బాలయ్య చేస్తున్న అన్‌స్టాపబుల్ షోకి కేటీఆర్ హాజరు కానున్నట్టు ప్రచారం అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన రానా, విజయ్ దేవరకొండతో కలిసి ఓ ప్రోగ్రాం చేసినట్టు వార్తలు రావడం ఆసక్తిని రేపుతుంది.అన్‌స్టాపబుల్ షోలో బాలయ్య అటు సినీ సెలబ్రిటీలు ఇటు రాజకీయ నాయకులని కూడా ఇంటర్వ్యూలు చేశారు. వాటికి మంచి రేటింగ్స్ వచ్చాయి. మరి రానా, విజయ్ దేవరకొండలతో కలిసి కేటీఆర్ షో రూపొందినట్టు వార్తలు వస్తుండగా, ఈ షో ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేస్తుందా అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు.