ఖుష్బూ కూతురిని చూశారా.. బాబోయ్ టూ హాట్ గురూ..!

ఖుష్బూ కూతురిని చూశారా.. బాబోయ్ టూ హాట్ గురూ..!

ఖుష్బూ.. ఈమె గురించి ఈ త‌రం వాళ్ల‌కి అంత‌గా తెలియ‌క‌పోవ‌చ్చు కాని 90ల‌లో ఈవిడ ఇండ‌స్ట్రీని ఓ ఊపు ఊపేసింది. సుమారు 200కు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన ఈ అందాల తార తెలుగులోనే కాదు తమిళ్‌, కన్నడ, మలయాళ ప్రేక్ష‌కుల‌కి కూడా మంచి వినోదాన్ని పంచింది. ఇక త‌న న‌ట‌న‌కి ఎన్నో అవార్డుల‌ని కూడా ద‌క్కించుకుంది. ఖుష్బూకి ఆమె అభిమానులు ఏకంగా గుడి కూడా క‌ట్టారు. స్టార్ హీరోల‌తో న‌టించి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు ద‌క్కించుకున్న ఖుష్బూ ఇప్పుడు స‌పోర్టింగ్ రోల్స్ పోషిస్తూ అల‌రిస్తుంది. మ‌రోవైపు రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్నారు. ఖుష్బూ వెంకటేష్ హీరోగా పరిచయమైన కలియుగపాండవులు సినిమాతో తెలుగులోకి ఆరంగేట్రం చేసింది.

ఆమె తెలుగులో చేసిన తొలి సినిమానే మంచి హిట్ కావ‌డంతో ఇక అవ‌కాశాలు వ‌రుస‌గా వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో పేకాట పాపారావు, రాక్షస సంహారం, జయసింహ , తేనెటీగ (1991), భారతంలో అర్జునుడు తదితర హిట్‌ సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించి అల‌రించింది. హీరోయిన్‌గా బిజీగా ఉన్న సమయంలోనే డైరెక్టర్‌ సుందర్‌తో ప్రేమలో ప‌డ్డ ఖుష్బూ 1991లో అత‌నిని పెళ్లాడింది.వారి వైవాహిక జీవితంలో అవంతిక, అనంతిక అనే ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు జ‌న్మించారు. అప్పుడ‌ప్పుడు ఖుష్బూ వారి పిల్ల‌ల ఫొటోలని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ పెద్ద షాకిస్తుంటుంది. పిల్ల‌ల ఫొటోలు చూసి ఖుష్బూకి ఇంత పెద్ద పిల్లలు ఉన్నారా అని ఆశ్చ‌ర్య‌పోతుంటారు.

ఖుష్బూ కూతురు అవంతిక ప్ర‌స్తుతం విదేశాల‌లో చ‌దువుకుంటుండ‌గా, ఆమె త‌న గ్లామ‌ర్‌తో అంద‌రిని క‌ట్టిప‌డేస్తుంది. త‌ల్లికి ఏ మాత్రం తీసిపోని అందంతో అంద‌రిని ఫిదా చేస్తుంది. తాజాగా అవంతిక హాట్ ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అందాల ఆర‌బోత‌తో క‌ట్టి ప‌డేస్తుంది. వ‌య్యారాలు ఒల‌క‌బోస్తూ క్యూట్ పోజులు ఇచ్చిన ఈ అమ్మ‌డిని చూసి ప్ర‌తి ఒక్క‌రు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. చూస్తుంటే రానున్న రోజుల‌లో ఈ చిన్నది క‌థానాయిక‌గా ఎంట్రీ ఇచ్చి ఇండ‌స్ట్రీని ఓ ఊపు ఊప‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.