మ‌హేష్ బాబు ఫ్యామిలీ స్విట్జ‌ర్లాండ్‌కి చెక్కేశారా.. గ‌డ్డ క‌ట్టే చ‌లిలో మ‌హేష్ పిల్ల‌ల సంద‌డి

మ‌హేష్ బాబు ఫ్యామిలీ స్విట్జ‌ర్లాండ్‌కి చెక్కేశారా.. గ‌డ్డ క‌ట్టే చ‌లిలో మ‌హేష్ పిల్ల‌ల సంద‌డి

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కాస్త ఖాళీ దొరికిందంటే చాలు ఏదో పక్క ఊరు వెళ్లిన‌ట్టు విదేశాల‌కి వెళ్లి వ‌స్తుంటాడు. సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి త‌ప్ప‌క స‌మ‌యం కేటాయిస్తుంటాడు సూప‌ర్ స్టార్. త్వ‌ర‌లో రాజ‌మౌళితో ఓ సినిమా చేయ‌నున్నాడు మ‌హేష్ బాబు. ఒక్క‌సారి రాజ‌మౌళి కాంపౌండ్‌లోకి మ‌హేష్ ఎంట‌ర్ అయ్యాడంటే ఎప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తాడో కూడా తెలియ‌దు. అందుకే రాజ‌మౌళి సినిమా స్టార్ట్ కాక‌ముందే మ‌హేష్ బాగా చిల్ అవుతున్నాడు. రీసెంట్‌గా ఆయ‌న ఫ్యామిలీతో క‌లిసి టూర్ వెళ్లాడు. ఎక్క‌డికి వెళ్లి ఉంటాడా అని అంద‌రు ఆలోచిస్తున్న క్ర‌మంలో ఫ్యామిలీ అంతా స్విట్జ‌ర్లాండ్ చెక్కేసినట్టు తెలుస్తుంది.

సాధార‌ణంగా మ‌న దేశం నుండి వేరే దేశానికి అప్పుడప్పుడు ట్రిప్స్ వేస్తుంటాం. కాని మ‌హేష్ మాత్రం బ‌య‌ట దేశాల నుండి మ‌న‌దేశానికి ట్రిప్‌కి వ‌చ్చిన‌ట్టు వ‌స్తుంటారు. టాలీవుడ్ మరే హీరో కూడా ఇంత‌గ‌నం టూర్స్ వేసి ఉండ‌డు.ఓ సారి ఎన్టీఆర్ కూడా దీనిపై మహేష్‌ని ఓ షోలో అడ‌గ‌గా, దానికి ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చాడు. అయితే ప్ర‌స్తుతం మ‌హేష్ ఫ్యామిలీ మంచు ప్ర‌దేశంలో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుండ‌గా, వాటికి సంబంధించిన ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. సితార, గౌతమ్‌లు ఇద్దరూ కూడా గడ్డ కట్ట చలిలో ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఫోటోలు చూస్తే తెలుస్తోంది. ఇక మంచులో సితార, గౌతమ్‌లు పెట్టిన పోజులు, షేర్ చేసిన ఫోటోలు అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి.

ఈ మధ్య గౌతమ్ కూడా నెట్టింట్లో బాగానే యాక్టివ్ గా ఉంటున్నాడు. త‌న‌కి సంబంధించిన ఫొటోల‌ని అప్పుడ‌ప్పుడు షేర్ చేస్తున్నాడు. ఇక సితార గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ చిన్నారి సినిమాల‌లోకి రాక‌పోయిన సోష‌ల్ మీడియా ద్వారానే విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. సితారని త్వ‌ర‌లో సినిమాలలోకి తీసుకు వ‌చ్చేందుకు మ‌హేష్‌, సితార ప్లాన్ చేస్తున్న‌ట్టు టాక్. ఇక మ‌హేష్ విష‌యానికి వ‌స్తే చివ‌రిగా గుంటూరు కారం చిత్రంతో ప‌ల‌క‌రించాడు. ఈ మూవీ అంత‌గా అల‌రించ‌లేక‌పోయింది. ఇప్పుడు రాజ‌మౌళి సినిమాతో అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. ఈ మూవీ ఎప్పుడు మొద‌ల‌వుతుంది, ఎప్పుడు పూర్తై రిలీజ్ అవుతుంది అనే దానిపై క్లారిటీ లేదు.