మమతా బెనర్జీ నుదుటికి తీవ్రమైన గాయం..రక్తం కారుతున్న ఫొటోలు విడుదల చేసిన టీఎంసీ

లోక్‌సభ ఎన్నికలకి ముందు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా గాయపడ్డారు. ఆమె నుదుటిపై బలమైన గాయం కావడంతో తీవ్రమైన రక్తస్రావం అవుతుంది. మమతా బెనర్జీకి ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. అయితే కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రిలో ఆమెకి చికిత్స జరుగుతున్నట్టు తెలుస్తుండగా, ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.మమత బెనర్జీ ఇంట్లో వ్యాయమం చేస్తున్న సమయంలో కిందపడిపోగా ఆమె నుదుటికి బలంగా దెబ్బ తగిలింది.
దీంతోనుదుటి నుంచి రక్తం కారుతూ కళ్లపై నుంచి ముక్కు, నోరు గుండా మెడ వరకు కారినట్టు ఆమెకి సంబంధించిన ఫొటోలని చూస్తుంటే అర్ధమవుతుంది. గాయపడ్డ వెంటనే ఆమెని అభిషేక్ బెనర్జీ వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే దీదీకి బలమైన గాయం కావడంతో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు, కార్యకర్తలు, పలువురు నేతలు ప్రార్ధనలు చేస్తున్నారు. దీదీ గాయపడిన వార్తతో పాటు ఫోటోను తృణమూల్ కాంగ్రెస్ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా షేర్ చేసింది.
అయితే ఈ ఏడాది మమతా బెనర్జీ గాయపడడం ఇది రెండో సారి. జనవరి నెలలో, బర్ధమాన్ జిల్లా నుండి తిరిగి వస్తున్న సమయంలో ఆమె నుదుటిపై బలమైన గాయం అయింది. బర్ధమాన్ నుండి తిరిగి వస్తున్న సమయంలో బాగా వర్షం వస్తుందని సీఎం కారు డ్రైవర్ ఒక్కసారిగా సడెన్ బ్రేక్ వేయడంతో మమతా తలకి బలమైన గాయం అయింది. ఆ సమయంలో ఆమె చికిత్స తీసుకొని కోలుకున్నారు. అది జరిగిన కొద్ది రోజులకే తిరిగి మమతా నుదుటికి గాయం కావడం అభిమానులకి ఆందోళన కలిగిస్తుంది. . ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, టీఎంసీ పార్టీ పూర్తి వివరాలని ఇంకా వెల్లడించలేదు.