మ‌లద్వారం గుండా శరీరంలోకి ప్ర‌వేశించిన చేప‌..! షాకైన డాక్ట‌ర్లు..

ఓ వ్య‌క్తికి తీవ్ర‌మైన క‌డుపు నొప్పి రావ‌డంతో ఆస్ప‌త్రికి వెళ్లాడు. అత‌నికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, పెద్ద పేగులో స‌జీవంగా ఉన్న ఈల్ చేపను వైద్యులు గుర్తించారు. దీంతో డాక్ట‌ర్లు షాక్ అయ్యారు. ఈ ఘ‌ట‌న వియ‌త్నాంలో చోటు చేసుకుంది. ప్ర‌స్తుతం ఈ వార్త నెట్టింట వైర‌ల్ అవుతోంది.

మ‌లద్వారం గుండా శరీరంలోకి ప్ర‌వేశించిన చేప‌..! షాకైన డాక్ట‌ర్లు..

క‌డుపులో నొప్పి వ‌స్తే డాక్ట‌ర్ ద‌గ్గ‌రికి వెళ్తాం. ప‌రీక్షించిన అనంత‌రం నొప్పి తీవ్ర‌త‌ను బ‌ట్టి మెడిసిన్స్ రాసిస్తుంటారు. క‌డుపు నొప్పి తీవ్రంగా ఉంటే స్కానింగ్ నిర్వ‌హించి, కార‌ణాలు క‌నుగొనేందుకు ప్ర‌య‌త్నిస్తారు. అప్పుడు స‌ర్జ‌రీ అవ‌స‌రం అనుకుంటే నిర్వ‌హించి, ఉప‌శ‌మ‌నం క‌ల్పిస్తారు. అయితే ఓ వ్య‌క్తికి తీవ్ర‌మైన క‌డుపు నొప్పి రావ‌డంతో ఆస్ప‌త్రికి వెళ్లాడు. అత‌నికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, పెద్ద పేగులో స‌జీవంగా ఉన్న ఈల్ చేపను వైద్యులు గుర్తించారు. దీంతో డాక్ట‌ర్లు షాక్ అయ్యారు. ఈ ఘ‌ట‌న వియ‌త్నాంలో చోటు చేసుకుంది. ప్ర‌స్తుతం ఈ వార్త నెట్టింట వైర‌ల్ అవుతోంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. వియ‌త్నాంలోని క్వాంగ్ నీంహ్ ప్రావిన్స్‌లోని హాయ్‌హా జిల్లాకు చెందిన ఓ వ్య‌క్తి(24)కి ఇటీవ‌లే తీవ్ర‌మైన క‌డుపు నొప్పి వ‌చ్చింది. దీంతో ఆ నొప్పిని భ‌రించ‌లేక స్థానిక ఆస్ప‌త్రికి వెళ్లాడు. బాధితుడికి ఎక్స్ రే, అల్ట్రా సౌండ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, పెద్ద పేగుల్లో ఈల్ చేప ఉన్న‌ట్లు గుర్తించారు. చేప కార‌ణంగా పెద్ద పేగు చివ‌ర‌న ఉండే కోలాన్‌లో చాలా చోట్ల రంధ్రాలు ప‌డిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు.

దీంతో అత‌నికి వైద్యులు స‌ర్జ‌రీ నిర్వ‌హించి, స‌జీవంగా ఉన్న ఈల్ చేప‌ను పేగుల్లోంచి తొల‌గించారు. ఈ చేప పొడ‌వు 12 ఇంచులు ఉంద‌ని పేర్కొన్నారు. పేగులో గాయ‌ప‌డ్డ భాగాన్ని కూడా పూర్తిగా తొల‌గించారు. రోగి మ‌ల‌ద్వారం ద్వారా అత‌ని శ‌రీరంలోకి ఈల్ చేప ప్ర‌వేశించి ఉండొచ్చ‌ని వైద్యులు అనుమానం వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం రోగి కోలుకుంటున్నాడ‌ని వైద్యులు తెలిపారు. అయితే, మలద్వారం, పురీషనాళం మీదుగా పెద్దపేగు వరకూ ఆ జీవి ఎలా వెళ్లిందో ఎవరికీ అంతుచిక్కట్లేదు.