అట్ట‌హాసంగా బిగ్ బాస్ మాన‌స్ పెళ్లి వేడుక‌.. సంద‌డి చేసిన సీరియ‌ల్స్ ఆర్టిస్ట్స్

అట్ట‌హాసంగా బిగ్ బాస్ మాన‌స్ పెళ్లి వేడుక‌.. సంద‌డి చేసిన సీరియ‌ల్స్ ఆర్టిస్ట్స్

బిగ్ బాస్ షోతో పాటు బ్ర‌హ్మ‌ముడి అనే సీరియ‌ల్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌ర‌య్యాడు మాన‌స్… హీరోగా గోళీసోడా వంటి కొన్ని సినిమాల్లో నటించాడు. అనంతరం కోయిలమ్మ సీరియల్ తో బుల్లి తెరపై అడుగు పెట్టిన మాన‌స్‌కి వెండితెర క‌న్నా బుల్లితెర వ‌ల‌నే ఎక్కువ క్రేజ్ ద‌క్కింది. బిగ్ బాస్ షోలో పాల్గొన్న మాన‌స్ చాలా రోజుల పాటే ఉన్నాడు. పింకీ వ్య‌వ‌హారంతో ఆయ‌న మ‌రింత ఫేమ‌స్ అయ్యాడు. బ్ర‌హ్మ‌ముడి అనే సీరియ‌ల్‌లో న‌టిస్తున్న మాసస్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కి చాలా సుప‌రితుడ‌య్యాడు. అయితే కొద్ది రోజుల క్రితం ఆయ‌న త‌న నిశ్చితార్థం జ‌రిగిన‌ట్టు ప్ర‌క‌టించాడు. కాబోయే భార్య పేరు శ్రీజ అని తెలియ‌జేశాడు. అయితే బుధవారం (నవంబర్‌ 22) రాత్రి సరిగ్గా 8..55 గంటలకు శ్రీజ అనే అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేసాడు మాన‌స్. విజయవాడ వేదికగా వీరి వివాహం గ్రాండ్‌గా జరిగింది.

పెళ్లికి ముందు హ‌ల్దీ వేడుక‌ని ఈ జంట ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకున్నారు. హాల్దీ వేడుకల్లో భాగంగా దంపతులు ఇద్దురు ఒకరి మీద ఒకరు పసుపు నీళ్లు గుమ్మరించుకున్నారు.వచ్చిన బంధువులు కూడా ఇద్దరికి పసుపు రాసి ఈ జంట‌ని ఆశీర్వ‌దించారు. ఈ వేడుకల్లో బిగ్‌ బాస్‌ కంఎటస్టెంట్స్‌ ప్రియా, ఆర్జే కాజల్‌, శుభ శ్రీ, రాయగురు, హమీదా, టేస్టీ తేజాతో పలువురు సినీ ప్రముఖులు సంద‌డ చేశారు. ఇక డ్యాన్స్‌ల‌తోను నానా ర‌చ్చ చేశాడు. ప్ర‌స్తుతం మాన‌స్‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

నూత‌న జంట‌కి పలువురు బుల్లితెర ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కాబోయే దంపతులకు ముందస్తు పెళ్లి శుభాకాంక్షలు, అభినందనలు తెలియ‌జేస్తున్నారు. మానస్ పలు బుల్లితెర సీరియల్స్ లో నటించడమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటించారు. యాంకర్ విష్ణు ప్రియతో కలిసి ప్రైవేట్ ఆల్బామ్స్ కూడా చేసి అల‌రించాడు.మానస్‌ అసలు పేరు సాయి రోహిత్‌. పద్మిని- వెంకటరావు నాగులపల్లిల ఏకైక సంతానం. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించాడు. సోడా గాలిసోడా, ప్రేమికుడు, గ్యాంగ్‌ ఆఫ్‌ గబ్బర్‌ సింగ్‌, కాయ్‌ రాజా కాయ్‌ వంటి సినిమాల్లో స్పెషల్ క్యారెక్టర్స్ లో సందడి చేశాడు.