ఏంటి… శర్వానంద్ టాలీవుడ్ రిచెస్ట్ హీరోల్లో ఒకడా.. అతని ఆస్తుల విలువ తెలిస్తే నోరెళ్లపెట్టడం ఖాయం..!

టాలీవుడ్ యువ హీరోలలో శర్వానంద్ ఒకరు.హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ ఉంటాడు. రామ్ చరణ్‌కి క్లోజ్ ఫ్రెండ్ అయిన శర్వానంద్ ఇటీవల వైవాహిక జీవితంలోకి కూడా అడుగుపెట్టాడు. గత ఏడాది జూన్ నెలలో ఈయన రక్షిత రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకోగా, త్వరలో తండ్రి కూడా కాబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే శర్వానంద్‌ని ఇటీవల వరుస ఫ్లాపులు పలకరిస్తున్నా కూడా ఆయన డిఫరెంట్ కథలని ఎంచుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అయితే శర్వానంద్‌కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఇది చూసి ప్రతి ఒక్కరు నోరెళ్లపెడుతున్నారు.
శర్వానంద్ తాజాగా మంచు మనోజ్ హోస్ట్ చేస్తున్న ఉస్తాద్ కార్యక్రమానికి వచ్చారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రోమో విడుదల కాగా, ఇందులో భాగంగా శర్వానంద్ ఆస్తుల గురించి మంచు మనోజ్ ఓ ప్రశ్న అడిగారు. మీ జీవితంలో మీకు ఉస్తాద్ ఎవరు బాబాయ్ అంటూ మంచు మనోజ్ ప్రశ్నించగా.. మా తాతయ్య అంటూ శర్వానంద్ సమాధానం చెప్పారు. అప్పుడు వెంటనే ఎందుకు ఆస్తులు ఇచ్చారా అని మనోజ్ సెటైర్స్ వేశాడు. అయితే మనోజ్ మాటలని బట్టి నెటిజన్స్ పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. తాతయ్య నుండి శర్వానంద్‌కి కోట్లు విలువ చేసే ఆస్తులు వచ్చాయి కాబట్టే మనోజ్ అలా మాట్లాడి ఉంటాడని అనుకుంటున్నారు.
శర్వానంద్‌కి హైదరాబాద్‌లో చాలా ఆస్తులు ఉన్నాయని గతంలో పలు వార్తలు వచ్చాయి. ఒకానొక సమయంలో హైదరాబాద్లో ఎక్కడ చూసినా శర్వానంద్ స్థలమే ఉందని పలువురు హీరోలు మాట్లాడుకునే వారని ప్రచారాలు సాగాయి. శర్వానంద్ కూడా హైదరాబాద్లో విలువైన ప్రాపర్టీలు ఉన్నాయని కూడా కొన్ని సార్లు చెప్పుకువచ్చారు. మొత్తానికి ఉస్తాద్ ప్రోమో రిలీజ్ తర్వాత శర్వానంద్ ఆస్తులకి సంబంధించి నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఇక ఈ ప్రోమోలో చిరంజీవి రామ్ చరణ్ తో కలిసి ఉన్న ఫోటోలను చూపించగా శర్వానంద్ మాట్లాడుతూ రామ్ చరణ్ లాంటి ఫ్రెండ్ నాకు దొరకడం నిజంగా తన అదృష్టం అని చెప్పుకురావడం కొసమెరుపు.