హీరోయిన్స్‌తో పార్టీ పెట్టి వేల కోట్లు తిన్నాడంటూ చిరుపై మ‌న్సూర్ అలీఖాన్ ఫైర్

హీరోయిన్స్‌తో పార్టీ పెట్టి వేల కోట్లు తిన్నాడంటూ చిరుపై మ‌న్సూర్ అలీఖాన్ ఫైర్

ఇటీవ‌లి కాలంలో మ‌న్సూర్ అలీ ఖాన్ పేరు నెట్టింట తెగ మారుమ్రోగిపోతుంది. అందుకు కార‌ణం ఆయ‌న త్రిష‌పై సంచ‌లన కామెంట్స్ చేయ‌డ‌మే. రేప్ చేస్తానంటూ త్రిష‌పై అతను చేసిన కామెంట్స్ పై ఇండ‌స్ట్రీకి సంబంధించిన వారితో పాటు రాజ‌కీయ నాయ‌కులు కూడా ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. చిరంజీవి సైతం త్రిష‌కి స‌పోర్ట్ అందిస్తూ.. ఆయ‌న అలాంటి కామెంట్స్ చేయ‌డం ఖండించ‌ద‌గిన‌ద‌ని అన్నారు. అయితే చిరంజీవితో పాటు ప‌లువ‌రు మ‌న్సూర్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు. దీంతో వివాదం ముగిసింద‌ని అంద‌రు భావించారు. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిపై షాకింగ్ కామెంట్స్ చేసి మ‌రోసారి హాట్ టాపిక్ అయ్యారు.

చిరంజీవి ఏడాదికి ఒకసారి ఓల్డ్ హీరోయిన్లతో పార్టీలు చేసుకుంటారని మన్సూర్ అలీ ఖాన్ మండిపడ్డారు. వాళ్లతో వీళ్లతో పార్టీలు చేసుకునేందుకు ఆయనకు సమయం ఉంటుంది కానీ.. కానీ నాలాంటి వాళ్లకు ఫోన్ చేసి అసలు ఏం జరిగింది అని అడిగే సమయం ఉండదంటూ నిప్పులు చెరిగారు. పాత హీరోయిన్లతో పాటు తెలిసిన ఆడ వాళ్లకు మాత్రమే మెగాస్టార్ ఫోన్ చేస్తారంటూ ఆయ‌న‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన మ‌న్సూర్.. పార్టీ పెట్టి వేల కోట్లు తిన్నావంటూ కామెంట్ చేశారు. పార్టీ పెట్టి సంపాదించిన సొంతానికి వాడుకున్నారని, ప్రజలకు సహాయం చేయలేదని అన్నాడు. నాది వక్రబుద్ది అని చిరంజీవి అన్నాడు, మరీ ఆయన ఏం చేశాడు. పార్టీ పెట్టి వేల కోట్లు తిని పేదవారికి సాయం చేయలేదని మండిప‌డ్డారు.

చిరంజీవి తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ నాకు తెలియదు. ఆయన కూడా పార్టీ పెట్టాడు. వీళ్లంతా ఏం చేస్తున్నారో నాకు తెలియదు. వీరంతా కూడా సొంత ప్ర‌యోజ‌నం కోస‌మే డ‌బ్బులు వాడుకున్నార‌ని అన్నాడు. ప్రతి ఏడాది ఓల్డ్ హీరోయిన్లకి పార్టీ ఇచ్చే చిరంజీవి న‌న్ను ఎప్పుడూ పిలవలేదు. ఆయన కేవలం హీరోయిన్లకు మాత్రమే పార్టీ ఇస్తాడని, అది ఆయన ఇష్టమని చెప్పారు. త్రిష, ఖుష్బూలపై రూ. పదికోట్ల చొప్పున, చిరంజీవి రూ.20కోట్ల పరువునష్టం దావా వేసి వాటితో వచ్చిన డ‌బ్బుని తమిళనాడులో మధ్యం తాగి చనిపోయిన కుటుంబాలకు అందజేస్తా` అని మన్సూర్‌ అలీ ఖాన్‌ తెలిపారు.