బిగ్ బాస్ హౌజ్‌లో హ‌త్య‌.. రంగంలోకి పోలీసులు

బిగ్ బాస్ హౌజ్‌లో హ‌త్య‌.. రంగంలోకి పోలీసులు

గత సీజ‌న్స్ కి భిన్నంగా ఈ సీజన్ లో ప్ర‌తి సోమ, మంగ‌ళ‌వారాల‌లో నామినేష‌న్ ప్ర‌క్రియ చోటు చేసుకుంటున్న విష‌యం తెలిసిందే. ఈ వారం కూడా నామినేష‌న్ ప్ర‌క్రియ చాలా వాడివేడిగా సాగింది. తాజా ఎపిసోడ్‌లో శివాజీ.. గౌతమ్‌, అర్జున్‌లను నామినేట్ చేయ‌గా, యావర్‌.. అమర్‌ దీప్‌, అర్జున్‌లను, ప్రియాంక.. యావర్‌, శివాజీలను నామినేట్‌ చేశారు. మొత్తానికి 12వ వారంలో శివాజీ, అర్జున్‌, రతిక, గౌతమ్‌, ప్రశాంత్‌, యావర్‌, అమర్‌ దీప్‌, అశ్విని హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యేందుకు నామినేష‌న్‌లో ఉన్నారు. ఈ వారం డ‌బుల్ ఎలిమినేష‌న్ ఉంటుంది కాబట్టి రెండు వికెట్స్ ప‌డ‌నున్నాయి.

ఇక నామినేష‌న్ త‌ర్వాత బిగ్ బాస్ హౌజ్ రెండు గ్రూపులుగా విడిపోయి నామినేష‌న్స్ గురించి ముచ్చ‌టించుకున్నారు. అమర్‌ దీప్‌, ప్రియాంక, శోభా గ్రూపుగా నామినేషన్లపై, శివాజీ వ్యవహారంపై చెవులు కొరుకున్నారు. మ‌రోవైపు శివాజీ, యావర్‌, ప్రశాంత్‌ కలిసి ప్రియాంక గురించి చర్చించుకున్నారు. ప్రియాంక ప్రవర్తనపై శివాజీ కామెంట్‌ చేయడం హాట్ టాపిక్ అయింది. ఇక యావ‌ర్ తాను ద‌క్కించుకున్న ఎవిక్ష‌న్ పాస్ తిరిగి ఇచ్చేయ‌డంతో మ‌ళ్లీ ఎవిక్షన్‌ పాస్‌ కి సంబంధించిన టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో పల్లవి ప్రశాంత్‌ విన్నర్‌గా నిలిచాడు. ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ని దక్కించుకున్నాడు. అనంత‌రం అర్జున్‌, అమర్‌ దీప్‌ మినహా మిగిలిన వారిని ప్రత్యేకమైన రూమ్‌కి పిలిచి ఫుల్‌ మీల్స్ పెట్టారు బిగ్ బాస్. హ్యాపీగా పార్టీ చేసుకోమని తెలిపారు.

ఇది బిగ్‌ భార్య ఇచ్చిన విందుగా తెలిపారు. మరోవైపు అర్జున్‌, అమర్‌ లకు టాస్క్ ఇచ్చి, ఈ టాస్క్‌లో ఎవరి వద్ద ఎలాంటి ఆహారం ఉంది, హౌస్‌లో ఎంత ఆహారం ఉందో లెక్కించి బిగ్‌ బాస్‌కి తెలియజేయాలని పేర్కొన్నాడు. అనంత‌రం హౌజ్‌లో బిగ్‌ బాస్‌ భార్య హత్యకు గురయ్యిందని , ఆమె వద్ద విలువైన నగలు ఉన్నాయని, అవి మిస్‌ అయినట్టు కూడా తెలియ‌జేశారు. ఈ కేసుని డీల్ చేసే బాధ్య‌త పోలీసులైన అమర్‌ దీప్‌, అర్జున్‌లకు అప్పగించారు. దీంతో హౌజ్‌లో హత్య ఎవ‌రు చేశార‌నేది మిస్ట‌రీగా మారింది. హంత‌కుడు హౌజ్‌లోనే ఉన్నాడ‌ని తెలియ‌డంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ మిస్ట‌రీని చేజించిందేకు విచార‌ణ మొద‌లు పెట్టారు. మ‌రి నిందితుడిని ప‌ట్టుకుంటారా లేదా అనేది చూడాలి.