అసలు విశ్వరూపం చూపించి వారికి గట్టిగా క్లాస్ పీకిన నాగార్జున

బిగ్ బాస్ సీజన్ 7 కార్యక్రమం రంజుగా సాగుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రతి శని, ఆది వారాలలో మాత్రం మరింత ఇంట్రెస్టింగ్గా మారుతుంది. తాజా ఎపిసోడ్లో నాగార్జున హౌజ్ మేట్స్ చేసిన మిస్టేక్స్ పిన్ టూ పిన్ చెబుతూ వారి తప్పులను నిలదీస్తూ ఓ రేంజ్లో ఆడుకున్నాడు. రెండు రూపాలు చూపించిన వారి అసలుస్వరూపాలను బయటపెట్టి పెద్ద షాక్ ఇచ్చాడు. షో మొదట్లో అమర్, ప్రియాంకల మధ్య జరుగుతున్న టాక్‌ను చూసి అవాక్కవుతాడు. అప్పటి వరకు శోభతే బాగానే ఉన్న అమర్..ఆమెనన్ను వెన్నుపోటు పొడిచిందని చెబుతాడు. ఇది చూసి నాగ్ కూడా షాక్ అవుతాడు..
ఇక శివాజీ, ప్రిన్స్ యావర్‌ల మధ్య.. శోభ తీరు గురించి డిస్కషన్ జరగగా, ఆ పక్కనే హౌస్ లోపల.. భోళె, అశ్విని మధ్య కూడా.. శోభ మ్యాటర్ గురించి చర్చ జరుగుతూ ఉంటుంది. శుక్రవారం ఏం జరిగిందో చూపించిన నాగార్జున నయా కెప్టెన్ గౌతమ్‌ను మొదట అప్రిషియేట్ చేస్తారు. అనంతరం సింగ్ ఫ్లోటింగ్ టాస్క్‌లో సంచాలక్‌గా నువ్వు ఫెయిల్ అయ్యావంటూ గౌతమ్‌కి క్లాస్ పీకుతాడు ఇక శోభకి ఓ రేంజ్లో క్లాస్ ఇచ్చాడు నాగార్జున. లాస్ట్ వీక్ భోళె ఎర్రగడ్డ అంటే..తెగ గింజుకున్నావ్.. మరి అదే నువ్వు ప్రిన్స్‌ను పిచ్చోడు అంటే తప్పులేదా అని అడిగారు. అప్పుడు దానికి హీట్ ఆఫ్ ది మూమెంట్ లో అన్నాను శోభ సమాధానం చెబుతుంది.మరి భోలే విషయంలో కూడా అదే జరిగింది కదా అంటూ పలు వీడియోలు చూపించి శోభకి అటు యావర్‌కి గ్టటిగానే క్లాస్ పీకుతాడు నాగార్జున
ఇక సందీప్ దగ్గరకు వచ్చిన నాగార్జున మనం బొంగులో డ్యాన్సర్‌తో మాట్లాడదాం అని అన్నాడు. సందీప్ నువ్వు డ్యాన్స్ షో విన్ అయ్యావ్ కదా.. నువ్వు డ్యాన్సర్‌వా..? అని ప్రశ్నించాడు నాగ్. దానికి అవును సార్ కొరియోగ్రాఫర్ కూడా అంటూ సమాధానం ఇవ్వగా, బొంగులో సమాధానం వద్దు.. మరి డ్యాన్సర్వే కదా.. నన్ను డ్యాన్సర్ అనొద్దు.. అంటూ మరి ఎందుకు ఆ బొంగులో యాటిట్యూడ్ చూపించావ్.? అని సీరియస్ గా అడిగారు నాగ్. ఇంతలో సందీప్ ఏదో చెప్పబోతుండగా, బొంగులో డ్యాన్సర్ అనడం కరెక్టా తప్పా.. అని ప్రశాంత్‌ని అడిగారు నాగార్జున. దానికి అది గలీజ్ పదం అని చెప్పుకొచ్చాడు. ప్రశాంత్. మెజారిటీ మెంబర్స్ కూడా ఆ పదం తప్పు అనే చేయి ఎత్తారు. ఇక అమర్ దీప్ పై కూడా నాగార్జున సీరియస్ అయ్యారు. నీకు ప్రశాంత్ అంటే చిన్న చూపు కదా అని అడిగారు నాగ్. దానికి లేదంటూ సమాధానం ఇ్చాడు. అయితే ప్రశాంత్‌ని అన్న మాట ఎప్పుడైన సందీప్, అర్జున దగ్గర వాడావా అన్ని ప్రశించాడు. అప్పుడు తప్పు తెలుసుకున్న అమర్ క్షమాపణలు చెప్పాడు.మొత్తానికి శనివారం ఎపిసోడ్ చాలా వాడివేడిగానే సాగింది.