అర్జున్, ప్రియాంకలని వదిలి ఒక్కొక్కరికి గట్టిగా క్లాస్ పీకిన నాగార్జున

బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకు వచ్చేసింది. ఒకే ఒక్కవారం మాత్రమే మిగిలి ఉంది. ఈ సీజన్ టాప్ 5 ఎవరు, ట్రోఫీ ఎవరు అందుకోనున్నారు అనే చర్చ ఇప్పటికే జోరుగా సాగుతుంది. అయితే 13 వారాల పాటు బాగానే ఆడిన చాలా మంది కంటెస్టెంట్స్ ఇప్పుడు గేమ్‌పై పట్టు కోల్పోతున్నారు. ఈ క్రమంలో నాగార్జున శనివారం ఎపిసోడ్‌లో ఒక్కొక్కరికి గట్టిగానే ఇచ్చాడు. ముందు శుక్రవారం హౌజ్‌లో జరిగిన కొన్ని సన్నివేశాలు చూపించిన నాగ్ ఆ తర్వాత హౌజ్‌మేట్స్‌తో మాట్లాడాడు. ముందుగా అర్జున్ ఆటతీరుని అలాగే ప్రియాంక కూడా బాగా ఆడిందని కితాబిచ్చాడు నాగార్జున. వారి ఫొటోలని మాత్రమే పగలగొట్టకుండా మిగతా వారి ఫొటోలు పగలగొట్టి వారి వీడియోలని చూపించి తప్పు ఒప్పులని లేవనెత్తాడు.
శోభా శెట్టి నిజ స్వరూపం బయటపెట్టిన నాగార్జున.. గేమ్‌ని నువ్వు ఆడకపోగా, డిస్ట్రబ్ చేస్తున్నావని అన్నాడు. అలానే యావర్ విషయంలో ఆమె మాట్లాడిన మాటలు కానీ, అంతకు ముందు శివాజీ విషయంలో తాను చెప్పిన విషయాలు కానీ, ఫేవరిజం గురించి ఆమె చెప్పిన విషయాలను గురించి కూడా అడిగి ఆమెని గట్టిగానే నిలదీసాడు. దీంతో శోభా కన్నీళ్లు పెట్టకుంది. ఇక యావర్.. శోభా శెట్టితో అతను `ఛీ ఛీ ` అంటూ మాట్లాడిన తీరు, కోపం అరుస్తున్న తీరుపై నాగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక పల్లవి ప్రశాంత్.. తనని అమర్ దీప్ కొరికాడంటూ చేసిన రచ్చపై నిలదీసాడు. డాక్టర్‌ని నేను అడిగాను, ఏం కాలేదని అన్నారు. కాని నువ్వు ఏదోదో చెబుతున్నావంటూ మండిపడ్డారు నాగార్జున.
ఇక శివాజీ మరోసారి నోరు జారగా, దానిపై గట్టిగానే ఇచ్చేసాడు నాగార్జున. మెడపై తొక్కి చంపేవాడిని అంటూ మాట్లాడిన వ్యాఖ్యలపై నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వగా దానిని శివాజి చాలా సమర్ధించుకున్నాడు. ప్రియాంక, శోభలని ఉద్దేశించి నేను మాట్లాడలేదు, నా ఇంట్లో అలా చేస్తే వారిని అంటానని అన్నానని శివాజి అన్నారు. ఆడపిల్లలను ఎవరినైనా అలా మాట్లాడటం తప్పు అంటూ హౌజ్‌లో ఉన్న ఇద్దరు ఆడపిల్లలకి సారీ చెప్పించాడు నాగ్. ఇక అమర్ దీప్ సైకోలా ప్రవర్తిస్తున్నాడని, ప్రశాంత్‌ని కొరకడం, బెడ పిసకడం, పైగా మెడికల్ రూమ్‌కి పదా అంటూ నెట్టుకుంటూ వెళ్లడం వంటి విషయాలపై ఫుల్ సీరియస్ అయ్యాడు. మొత్తానికి శనివారం ఎపిసోడ్ మాత్రం చాలా చాలా వాడివేడిగానే సాగింది.