మ‌హేష్‌కి ఆ వ్య‌స‌నం ఉందా.. అది మాన్పించ‌లేక న‌మ్ర‌త అన్ని ఇబ్బందులు ప‌డుతుందా?

  • By: sn    breaking    Dec 23, 2023 12:06 PM IST
మ‌హేష్‌కి ఆ వ్య‌స‌నం ఉందా.. అది మాన్పించ‌లేక న‌మ్ర‌త అన్ని ఇబ్బందులు ప‌డుతుందా?

టాలీవుడ్ క్యూట్ పెయిర్ మ‌హేష్ బాబు, న‌మ్ర‌త చాలా మందికి ఆద‌ర్శం అని చెప్పాలి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్ప‌టికీ కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తూ ఉంటారు. అయితే తాజాగా మ‌హేష్ బాబు వ్య‌స‌నం గురించి న‌మ్ర‌త ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. మహేష్ కి వీడియో గేమ్స్ ఆడటం అంటే చాలా పిచ్చి అట. గౌతమ్, సితారతో కలిసి గంటల తరబడి ఆడతాడట. ఇది నమ్రతకు అసలు నచ్చేది కాదు. ఆ వీడియో గేమ్స్ పిచ్చి తగ్గించాలని నమ్రత చాలా ట్రై చేసిన అది మ‌హేష్ మానుకోలేదట‌. ఇదే కాకుండా గ‌తంలో మ‌హేష్‌కి ధూమపానం అల‌వాటు కూడా ఉండేద‌ట‌. విపరీతంగా స్మోకింగ్ చేసేవాడిని. ఆ వ్యసనం నుండి బయటపడ్డానని ఓ సందర్భంలో మహేష్ బాబు చెప్పుకొచ్చాడు.

మొబైల్ వ్య‌స‌నం కూడా మ‌హేష్ బాబుకి ఉండేద‌ని, నిద్ర లేవ‌గానే ఆయ‌న ఫోన్ చూస్తార‌ని కూడా పేర్కొన్నాడు. ధూమ‌పానం, మొబైల్ వ్య‌స‌నాలు మ‌హేష్ త‌గ్గించుకున్నా కూడా ఈ వీడియో గేమ్ పిచ్చి మాత్రం అస్స‌లు త‌గ్గ‌డం లేదట‌. ఈ విష‌యంలో న‌మ్ర‌త చాలా ఆందోళ‌న చెందుతున్న‌ట్టు టాక్. ఇక మ‌హేష్ బాబు సినిమాల విష‌యానికి వ‌స్తే ఆయ‌న ప్ర‌స్తుతం గుంటూరు కారం అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న విడుద‌ల కానుంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ దమ్ మసాలా పాట విడుదల కాగా, దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

సాంగ్ విజువల్స్, మహేష్ మాస్ స్వాగ్ మాత్రం కేక పెట్టిస్తోందని నెటిజ‌న్స్ కామెంట్స్ చేశారు. పాటను సంజిత్ హెగ్డే, థమన్ పాడగా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఇక ఈ సినిమా టీమ్ ప్రస్తుతం కేరళ వెళ్లి అక్కడ ఓ పాటను షూట్ చేయాలనీ అనుకున్నార‌ట‌. కేరళలో మహేష్, శ్రీలీల పై మూడవ పాట చిత్రీకరించాలని టీమ్ ప్లాన్ చేసిన‌ప్ప‌టికీ, అక్కడి పరిస్థితులు అనుకూలించకపోవడంతో.. ఇక కేరళ షూట్‌ను టీమ్ క్యాన్సల్ చేసిందట. ఇక‌ అదే పాటను హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చేయనున్నట్లుతెలుస్తోంది. వ‌రుస హిట్స్‌తో దూసుకుపోతున్న మ‌హేష్ బాబు తాజాగా గుంటూరు కారంతో మ‌రో హిట్ త‌న ఖాతాలో వేసుకుంటాడ‌ని చెబుతున్నారు.