మ‌హేష్ సినిమా కోసం రాజ‌మౌళి భారీ స్కెచ్.. మాములు ప్లానింగ్ వేయ‌లేదుగా..!

  • By: sn    breaking    Feb 29, 2024 11:33 AM IST
మ‌హేష్ సినిమా కోసం రాజ‌మౌళి భారీ స్కెచ్.. మాములు ప్లానింగ్ వేయ‌లేదుగా..!

సంచ‌ల‌నాల‌కి కేరాఫ్ అడ్రెస్‌గా మారాడు రాజ‌మౌళి. ఏళ్లు కొద్ది సినిమాల‌ని తీసిన అవి చరిత్ర‌లు సృష్టించే విధంగా ఉంటున్నాయి. బాహుబ‌లి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన జ‌క్క‌న్న ఇటీవ‌ల ఆర్ఆర్ఆర్ అనే చిత్రంతో టాలీవుడ్‌కి ఆస్కార్ అవార్డ్ కూడా తెచ్చిపెట్టాడు. ఇక ఇప్పుడు త‌న ఫోక‌స్ అంతా మ‌హేష్ బాబుతో చేయ‌బోవు సినిమాపై పెట్టాడు. హాలీవుడ్ రేంజ్ యాక్టర్ .. ఆస్కార్ రేంజ్ డైరెక్టర్ కలయికలో రాబోతున్నఈ సినిమాపై అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉండ‌డంతో మూవీకి సంబంధించి నిత్యం సోష‌ల్ మీడియాలో ఏదో ఒక వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉంది. ఇందులో అంతర్జాతీయ ఆర్టిస్ట్ ల‌తో పాటు టెక్నీషియన్లు కూడా యాడ్ అవుతార‌ని ఒక టాక్. చిత్రాన్ని సుమారు వెయ్యి కోట్లతో రూపొందించ‌నున్నార‌ని స‌మాచారం.

ఈ చిత్రంలో ఇండోనేషియాకి చెందిన చెల్సియా ఇస్లాన్‌ హీరోయిన్‌గా ఎంపికైందని, బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనెని కూడా క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం. నాగార్జున కూడా ఈ మూవీలో కీల‌క పాత్ర పోషించ‌నున్నారని ఆయ‌న స‌ర‌స‌న దీపికా న‌టించ‌నుంద‌ని టాక్.ఇక ఈ మూవీ వేడుక‌కి రాజ‌మౌళి ఎంతో ఇష్ట‌ప‌డే స్టీవెన్ స్పీల్బర్గ్ , అవతార్ సృష్టికర్త జేమ్స్ క్యామరూన్ లను ముఖ్య అతిథులుగా తీసుకురానున్న‌ట్టు స‌మాచారం. జక్కన్న తలపెట్టిన ఈ పని పూర్తి చేయడానికి ఎస్ఎస్ కార్తికేయ ఆల్రెడీ రంగంలోకి దిగాడని కూడా ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇద్ద‌రు కాక‌పోయిన క‌నీసం ఒక్క‌రైన వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా చూసి జేమ్స్ కామెరాన్.. రాజమౌళి క్రియేటివిటీకి మంత్ర ముగ్ధులు అయ్యారు. అవతార్ లాంటి గొప్ప సినిమాలను తెరకెక్కించిన కామెరాన్.. ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడుతూ ఓ ప్రత్యేక వీడియో చేయడం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఇటీవ‌ల ఓ అవార్డ్ ఫంక్ష‌న్‌లో కూడా రాజ‌మౌళి గురించి కామెరూన్ చాలా గొప్ప‌గా మాట్లాడారు. ఈ క్ర‌మంలోనే కామెరూన్ రావడం ఖాయం అని అంటున్నారు. ఇక ఈ సినిమా టైటిల్‌కి సంబంధించి ఇటీవ‌ల ఒక పేరు నెట్టింట వైర‌ల్‌గా మారింది. ‘మహారాజ’ అనే టైటిల్‌ని చిత్రానికి ఫిక్స్ చేసినట్లు టాలీవుడ్‌లో ప్ర‌చారం జరిగింది.. మహేష్ పేరులో మహా, రాజమౌళి పేరులో రాజా తీసుకొని ‘మహారాజ’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసిన‌ట్టు ఇన్‌సైడ్ టాక్.