న‌య‌న‌తార సోద‌రుడిని ఎప్పుడైన చూశారా.. ఒకే పోలిక‌తో ఉన్నారుగా..!

  • By: sn    breaking    Feb 19, 2024 11:07 AM IST
న‌య‌న‌తార సోద‌రుడిని ఎప్పుడైన చూశారా.. ఒకే పోలిక‌తో ఉన్నారుగా..!

లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. హీరోల‌కి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమె సొంతం. ఒక‌ప్పుడు హీరోల స‌ర‌స‌న న‌టించి మంచి పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మాత్రం కేవ‌లం లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ అల‌రిస్తుంది. నయనతార తమిళంతో పాటు.. తెలుగు,మలయాళ, హిందీ సినిమాలు అన్ని క‌లుపుకొని దాదాపు 80కి పైగానే సినిమాలు చేసింది. ఇటీవ‌ల జ‌వాన్ అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి స‌త్తా చాటింది అందాల ముద్దుగుమ్మ‌. ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌కి ఎలాంటి ఢోకా లేక‌పోయిన పర్స‌న‌ల్ లైఫ్‌లో మాత్రం కొంత ఇబ్బందులు ప‌డింది. ప్ర‌భుదేవి, శింబులతో ప్రేమ‌లో ప‌డి ఆ త‌ర్వాత వారికి బ్రేక‌ప్ చెప్పి ఆ త‌ర్వాత విఘ్నేష్ శివ‌న్‌తో కొన్నాళ్ల‌పాటు డేటింగ్ చేసింది.

దాదాపు 5 ఏళ్ళు డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో డేటింగ్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ త‌ర్వాత పెళ్లి చేసుకుంది.ఇక కొద్ది రోజుల‌కి ఈ దంపతులకు వయా మరియు ఉలాగ్ అనే ఇద్దరు కవల పిల్లలు స‌రోగ‌సి ద్వా పుట్టారు.ఇటీవ‌లి కాలంలో త‌న భర్త‌తో పాటు పిల్ల‌ల ఫోటోల‌ని సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి మంచి థ్రిల్ అందిస్తుంది న‌య‌న‌తార‌. అయితే న‌య‌న‌తార పెద్ద పెద్ద స్టార్ హీరోలంద‌రితో న‌టించిన విష‌యం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, రజినీకాంత్, ఎన్టీఆర్, బాలకృష్ణ, వెంకటేష్, విజయ్, అజిత్, సూర్య, విక్రమ్, ధనుష్, ఇలా తెలుగు,తమిళ సినీ ప్రముఖుల అంద‌రిని చుట్టేసింది. ఇప్ప‌టికీ న‌య‌న‌తార మంచి మంచి సినిమాలు చేస్తూ అల‌రిస్తుంది.

నయనతార చివరిగా అన్నపురాణి సినిమా చేసింది. తన 75వ చిత్రంగా విడుదలైన ఈ చిత్రానికి పెద్దగా ఆదరణ లభించలేదు. అయితే న‌య‌న‌తార కుటుంబం గురించి చాలా మందికి పెద్ద‌గా తెలియ‌దు. ఆమె చెన్నైలో ఇప్పుడు ఉంటున్న‌ప్ప‌టికీ న‌య‌న‌తార‌ది కేర‌ళ‌. ఆమె అస‌లు పేరు డ‌యానా కాగా, తండ్రి పేరు కురియన్ కొడియాతు, తల్లి పేరు ఒమన్ కురియన్, సోదరుడి పేరు లెనో. న‌య‌న‌తార త‌ల్లితండ్రి ఫొటోలు అప్పుడ‌ప్పుడు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్నా కూడా సోద‌రుడిని పెద్ద‌గా ఎవ‌రు చూడ‌లేదు. ఆయ‌న ఎక్క‌డ ఉంటున్నాడు కూడా ఎవ‌రికి తెలియ‌దు. అయితే న‌య‌న‌తార అన్న విదేశాల్లో ఉంటారు. తాజాగా ఆయ‌న పిక్ ఒక‌టి నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో లెనో నయన్ మరియు విఘ్నేష్ శివ ఇద్దరి భుజాలపై చేతులు వేసి పోజులు ఇచ్చాడు. ఈ పిక్ వైర‌ల్‌గా మారింది. లెనో దుబాయ్‌లో బిజినెస్ చేస్తున్న‌ట్టు తెలుస్తుండ‌గా, అన్న ద్వారా దుబయ్ లో నయనతార కూడా బిజినెస్ చేస్తుంద‌ని, ఇక్క‌డ సంపాదించింది అక్క‌డ ఇన్వెస్ట్ చేస్తున్న‌ట్టు వినికిడి.