టాలీవుడ్‌లో హీరోయిన్స్‌లో రిచెస్ట్ భామ ఎవ‌రో తెలుసా.. ఖ‌రీదైన బంగ్లాలు, కార్లు..!

  • By: sn    breaking    Feb 28, 2024 11:41 AM IST
టాలీవుడ్‌లో హీరోయిన్స్‌లో రిచెస్ట్ భామ ఎవ‌రో తెలుసా.. ఖ‌రీదైన బంగ్లాలు, కార్లు..!

టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఆ త‌ర్వాత బాలీవుడ్‌కి వెళ్లి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు అందుకున్న భామలు చాలా మంది ఉన్నారు. అయితే ఎంతో మంది భామ‌ల‌కి టాలీవుడ్ ఇండ‌స్ట్రీ మంచి స‌పోర్ట్ అందించింది. ఈ క్ర‌మంలోనే స్టార్స్‌గా ఎదిగిన వారు ఉన్నారు. ఆస్తులు కూడా బాగానే కూడ‌బెట్టారు.అప్ప‌టి శ్రీదేవి నుండి ఇప్ప‌టి ర‌ష్మిక వ‌ర‌కు చాలా మంది ఆస్తులు కూడ‌బెట్టిన‌ట్టు తెలుస్తుంది. 2024లో అత్యంత ధనిక హీరోయిన్ ఎవరు..? ఆహీరోయిన్ ఆస్తులు ఎన్నికోట్లు అనేది చూస్తే ముందుగా సౌత్ ఇండియాలో అత్యంత ధ‌నిక న‌టిగా న‌య‌న‌తార పేరు టాప్‌లో ఉంది. ఈ అమ్మ‌డు 80కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటీమణుల్లో నయనతార ఒకరు. ఎంతో మంది స్టార్ హీరోల స‌ర‌స‌న నటించ‌డ‌మే కాకుండా ఎన్నో అవార్డులు కూడా అందుకుంది.

అన్ని భాషల్లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ద‌క్క‌డంతో న‌య‌న‌తార బాగానే వెన‌కేసుకుంది. ఆమె మొత్తం ఆస్తి విలువ దాదాపు 300 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. న‌య‌న‌తార‌కి చెన్నైతో పాటు, హైదరాబాద్, కేరళ, ముంబై వంటి నగరాల్లో నగరాల్లో విలాసవంత‌మైన ఇళ్లు, అలానే వంద కోట్ల విలువైన 4బీహెచ్‌కే బెడ్ రూం హౌజ్ ఒక‌టి ఉంది. ప్ర‌త్యేక ప్రైవేట్ జెట్ కూడా ఆమె క‌లిగి ఉంది. నయనతార గ్యారేజ్ లో BMW 5 సిరీస్, Mercedes GLS 350T, టయోటా ఇన్నోవా క్రిస్టా, ఫోర్డ్ ఎండీవర్ మరియు BMW 7-సిరీస్ వంటి లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. త‌న భ‌ర్త విఘ్నేష్ శివ‌న్‌తో క‌లిసి రౌడీ పిక్చ‌ర్స్ అనే నిర్మాణ సంస్థ కూడా న‌డుపుతుంది. నిర్మాణ సంస్థ విలువ 50 కోట్లుగా చెబుతున్నారు.

నయనతార సినిమాలు మాత్రమే కాదు .. కమర్షియల్ యాడ్స్ చేస్తుంది. వాటికి భారీగానే డిమాండ్ చేస్తుంది. ఇక నటి నయనతార సాయి వాలే అనే ప్రముఖ కంపెనీలో 5 కోట్లు పెట్టుబడి పెట్టిన‌ట్టు తెలుస్తుండ‌గా, దాని ద్వారా ఆమెకి భారీ ఆదాయం వ‌స్తున్న‌ట్టు స‌మాచారం. గత సంవత్సరం 2019లో, నయనతార డాక్టర్ రెనిటా రాజన్‌తో కలిసి లిప్ బామ్ కంపెనీని ప్రారంభించ‌గా, ఇది కూడా స‌క్సెస్ ఫుల్‌గా న‌డుస్తుంది. న‌య‌న‌తార కంపెనీ 100కి పైగా వివిధ రకాల లిప్ బామ్‌లను కలిగి ఉన్న మొదటి ప్రధాన బ్రాండ్ అని చెప్పప్పొచ్చు. యూఏఈలో చమురు వ్యాపారంలో ఆమె దాదాపు 100 కోట్ల పెట్టుబడి పెట్టరని.. అంది ఆమె సోదరుడు చూసుకుంటారని టాక్. స్నేహితుడితో కలిసి స్కిన్ కేర్ కంపెనీ కూడా ఆమె న‌డుపుతుంద‌ని స‌మాచారం. మలేషియాలో 9 చర్మ సంరక్షణ ఉత్పత్తులను ప్రారంభించిన న‌య‌న‌తార‌… మహిళల కోసం శానిటరీ నాప్‌కిన్ బ్రాండ్ అయిన ఫెమీ 9ని కూడా ఆయన ప్రారంభించారు. ఇలా న‌య‌న‌తార భారీగానే ఆస్తులు కూడ‌బెట్టిన‌ట్టు తెలుస్తుంది.