ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: బండి సంజయ్ అనుచరుడికి నోటీసులు
విధాత: ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్‌కు గురువారం సిట్ నోటీసులు జారీ చేసింది. నవంబర్ 21న ఉదయం 10:30 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో ఏ1గా ఉన్న రామచంద్రభారతికి శ్రీనివాస్ విమాన టికెట్లు కొనుగోలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మరో ఇద్దరు అదుపులోకి.. ఇదే కేసులో పోలీసులు మరో ఇద్దరిని ఢిల్లీలో అదుపులో తీసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో అరెస్టయి […]

విధాత: ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్‌కు గురువారం సిట్ నోటీసులు జారీ చేసింది. నవంబర్ 21న ఉదయం 10:30 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో ఏ1గా ఉన్న రామచంద్రభారతికి శ్రీనివాస్ విమాన టికెట్లు కొనుగోలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
మరో ఇద్దరు అదుపులోకి..
ఇదే కేసులో పోలీసులు మరో ఇద్దరిని ఢిల్లీలో అదుపులో తీసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో అరెస్టయి విచారణ ఎదుర్కొంటున్న నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు వీరిద్దరిని ఫరీదాబాద్ ప్రాంతంలో అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది.
అరెస్టయిన వారితో సన్నిహిత సంబంధాలు..
వీరిద్దరూ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రామచంద్రభారతికి అత్యంత సన్నిహితులనే ప్రచారం వినిపిస్తోంది. అంతేకాదు మరో నిందితుడు నందుకుమార్‌తోనూ వీరికి సాన్నిహిత్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును తెలంగాణ ప్రభుత్వం సిట్‌కు అప్పగించిన మరుసటి రోజునే సైబరాబాద్‌కు చెందిన ప్రత్యేక బృందం ఒకటి హస్తినకు చేరుకొని దర్యాప్తు చేపట్టింది.
నిందితులు ఇచ్చిన ప్రాథమిక సమాచారం, కాల్‌డేటా ఆధారంగా ఫరీదాబాద్‌లో వీరిని అదుపులోకి తీసుకున్నది. వీరికి ఈ కేసులో అరెస్టైన వారితో సాన్నిహిత్యం, ఎమ్మెల్యేల కొనుగోళ్లలో వీరి ప్రమేయం ఎంత ఉన్నది తదితర వివరాలపై ఆరా తీస్తున్నది.
ఇద్దరి అరెస్టుతో విచారణ వేగవంతం
పోలీసుల అదుపులో ఉన్న నిందితులకు సంబంధించిన వీడియోల్లో రాజస్తాన్, ఢిల్లీ, ఏపీ వంటి రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సిద్ధంచేసిన ప్రణాళిక, దీనికి తామందించిన సహకారం వంటి అంశాల ప్రస్తావన ఉన్నాయి. దీంతో ఈ వ్యవహారంలో వీరికి ఉన్న సంబంధాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
అదుపులోకి తీసుకున్న ఇద్దరినీ రెండు, మూడు రోజుల్లో అరెస్ట్ చేసి, మీడియా ముందు తీసుకొచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ ఇద్దరి అరెస్ట్‌తో కేసు విచారణ మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉందని సర్వత్రా అనుకుంటున్నారు.