ఆస్కార్ వేదికపై న్యూడ్ షో చేసి అందరికి షాక్ ఇచ్చిన జాన్ సీనా.. స్టార్ రెజ్లర్ పనికి అందరు నోరెళ్లపెట్టేశారుగా..!

96వ ఆస్కార్ అవార్డ్ వేడుక సోమవారం తెల్లవారుఝామున లాస్ ఏంజెల్స్ వేదికగా అట్టహాసంగా జరిగింది. ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తొలిసారి ఆస్కార్ అందుకోగా, ఆయన తీసిన ‘ఓపెన్ హైమర్’ ఈ ఆస్కార్ అవార్డుల్లో సత్తా చాటడం విశేషం. ఈ చిత్రానికి గాను అనేక అవార్డ్లు దక్కాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడితో సహా పలు అవార్డులను ఎగరేసుకుపోయింది ఈ మూవీ. మరోవైపు ‘పూర్ థింగ్స్’ కూడా తన హవా కొనసాగించింది.అయితే కూల్‌గా జరుగుతుందనుకున్న ఆస్కార్ వేడుకలో స్టార్ రెజ్లర్ జాన్ సీనా న్యూడ్‌గా వచ్చి అందరికి షాక్ ఇచ్చాడు.
ఆస్కార్స్ వేదికపై ఎప్పుడూ ఏదో ఒక వివాదం జరగుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ సారి జాన్ సీనా న్యూడ్ గా స్టేజ్ పైకి వచ్చి అందరు అవాక్కయ్యేలా చేశాడు. ఈ వేడుకలో బెస్ట్ కాస్ట్యూమ్ అవార్డును ఇచ్చే అవకాశం డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ జాన్ సీనాకు దక్కగా, అతనిని స్టేజ్‌పైకి ఆహ్వానించారు. ఈ స్టార్ రెజ్లర్ స్టేజ్ పైకి న్యూడ్ గా వచ్చి తన ప్రైవేట్ పార్ట్ కనిపించకుండా అడ్డుగా విన్నర్ పేరు ఉన్న కార్డు పెట్టుకున్నారు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా జాన్ సీనా రావడం చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. కొందరైతే తెగ నవ్వేసుకున్నారు.
సినిమాల్లో కాస్టూమ్ డిజైనర్ అవసరం ఎంత ఉంటుందనేది చెప్పే విధంగా మనోడు తెలియజేశాడు. అయితే వేరే వ్యక్తి వచ్చి అవార్డ్ నామినా జాబితా అనౌన్స్ చేశాడు. బార్బీ, కిల్లర్స్ ఆఫ్ ఫ్లవర్ మూన్, నెపోలియన్, ఓపెన్‌హైమర్,పూర్ థింగ్స్ నామినేషన్లో నిలిచాయి..హోలి వెడ్డింగ్టన్ (పూర్ థింగ్స్)కి అవార్డ్ దక్కింది. అయితే నామినీల వీడియోను బిగ్ స్క్రీన్ పై ప్లే చేస్తున్న సమయంలో స్టేజ్‌పై లైట్స్ అన్ని ఆర్పేశారు. అప్పుడు ఒక ఐదారుగురు వ్యక్తులు వేగంగా వచ్చి జాన్ సీన్‌కి డ్రెస్ వేసి వెళ్లిపోగా అప్పుడు అతను విజేతని ప్రకటించాడు. కోట్లాది మంది చూసే ఈ వేడుక స్టేజ్ పైకి ఓ స్టార్ రెజ్లర్ ఇలా న్యూడ్ గా రావడంపై పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.