హ‌నీమూన్‌కు వెళ్దామ‌న్న క‌మెడియ‌న్.. చెంప ఛెల్లుమ‌నిపించిన గాయ‌ని

పాకిస్తాన్‌కు చెందిన ఓ టీవీ చానెల్ ప‌బ్లిక్ డిమాండ్ షోను న‌డిపిస్తోంది. అయితే ఈ షోకు అతిథులుగా పాకిస్తానీ సింగ‌ర్ షాజియా మంజూర్, క‌మెడియ‌న్ షేర్రి న‌న్హా హాజ‌ర‌య్యారు.

హ‌నీమూన్‌కు వెళ్దామ‌న్న క‌మెడియ‌న్.. చెంప ఛెల్లుమ‌నిపించిన గాయ‌ని

పాకిస్తాన్‌కు చెందిన ఓ టీవీ చానెల్ ప‌బ్లిక్ డిమాండ్ షోను న‌డిపిస్తోంది. అయితే ఈ షోకు అతిథులుగా పాకిస్తానీ సింగ‌ర్ షాజియా మంజూర్, క‌మెడియ‌న్ షేర్రి న‌న్హా హాజ‌ర‌య్యారు. ఇక హ‌నీమూన్ గురించి క‌మెడియ‌న్ ప‌దేప‌దే ప్ర‌స్తావించ‌డంతో సింగ‌ర్ షాజియాకు కోపం క‌ట్ట‌లు తెంచుకుంది. దీంతో షేర్రిపై ఆమె దాడి చేసింది. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ప‌బ్లిక్ డిమాండ్ షో న‌డుస్తుండ‌గా.. క‌మెడియ‌న్ న‌న్హా మాట్లాడుతూ.. షాజియా మ‌నం పెళ్లి చేసుకున్న త‌ర్వాత‌.. హ‌నీమూన్ కోసం మాంటేకార్లోకు తీసుకెళ్తాను అని చెప్పారు. దీంతో షాజియా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. త‌న ప‌క్క‌నే అత‌నిపై దాడి చేసింది. చెంప ఛెల్లుమ‌నిపించింది.

గ‌తంలో కూడా ఒక‌సారి ఇలానే మాట్లాడితే లైట్ తీసుకున్నాను. ఇక ఇప్పుడు ఊరుకోను. ప‌దేప‌దే హ‌నీమూన్ అన‌డం ఏంటి..? ఆడ‌వారితో ఇలానే మాట్లాడుతారా..? థ‌ర్ట్ క్లాస్ ఇండివిడ్యువ‌ల్ అంటూ అత‌న్ని తిట్టారు షాజియా.

దీంతో షో హోస్ట్ మోహ‌సిన్ అబ్బాస్ హైద‌ర్ క‌ల్పించుకుని.. షోకు క‌ట్టుబ‌డి మాట్లాడాల‌ని క‌మెడియ‌న్‌ను హెచ్చ‌రించారు. తాను జోక్‌గా మాట్లాడాన‌ని న‌న్హా చెప్పుకొచ్చారు. కోపంతో ఉన్న సింగ‌ర్ స్టేజీ దిగి వెళ్లిపోయింది. మ‌రోసారి ఈ షోకు రాన‌ని ఆమె చెప్పి అటు నుంచి నిష్క్ర‌మించింది.