పాకిస్తాన్‌లో నాగార్జున‌ని పోలిన వ్య‌క్తి.. సంపాద‌న ల‌క్షల్లో ఉందిగా..!

  • By: sn    breaking    Mar 13, 2024 10:42 AM IST
పాకిస్తాన్‌లో నాగార్జున‌ని పోలిన వ్య‌క్తి.. సంపాద‌న ల‌క్షల్లో ఉందిగా..!

కింగ్ నాగార్జున గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే నాగ్‌కి తెలుగులోనే కాకుండా ఇత‌ర భాష‌ల‌లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కొన్నేళ్లుగా వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న నాగార్జున ఇప్పుడు త‌న కొడుకుల‌కి పోటీగా సినిమాలు చేస్తున్నాడు. చివ‌రిగా నా సామిరంగ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా వ‌చ్చి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. ప్ర‌స్తుతం మ‌రో మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు నాగ్. అయితే నాగార్జున‌ని టాలీవుడ్ న‌వ మ‌న్మ‌థుడు అంటార‌నే విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. ఇప్ప‌టికీ ఆయ‌న అందానికి ముగ్ధులు కాని వారు లేరు.

ఆరు ప‌దుల వ‌య‌స్సుకి వ‌చ్చిన కూడా నాగార్జున అదే ఫిజిక్ మెయింటైన్ చేస్తూ అంతే హ్యాండ్స‌మ్‌గా క‌నిపిస్తున్నారు. అయితే నాగార్జున‌ని పోలిన ఓ వ్య‌క్తి ఇప్పుడు పాకిస్తాన్‌లో క‌నిపించ‌డం, ఆయ‌న ల‌క్ష‌ల్లో సంపాదిస్తున్నాడ‌నే వార్త బ‌య‌ట‌కు రావ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దాయాది దేశం పాకిస్తాన్‌లో నాగార్జున పోలిక‌ల‌తో ఉన్న వ్య‌క్తి పేరు జైన్ అక్మ‌ల్ ఖాన్. అత‌ను అచ్చం నాగార్జున పోలిక‌ల‌తోనే క‌నిపిస్తున్నాడు. హెయిర్ స్టైల్‌, ఫేస్ క‌ట్ నాగార్జున మాదిరిగానే ఉండ‌డంతో అత‌ను ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాడు.

జైన్ అక్మల్ ఖాన్ చాలా కాలంగా యూట్యూబ్ ఛానల్ ర‌న్ చేస్తుండ‌గా, అత‌ను షికారి మాస్ పేరుతో ఫుడ్ వ్లాగ్స్ చేస్తూ ఫేమ‌స్ అయ్యాడు. అయితే రీసెంట్‌గా ఆయ‌న వీడియోలు కొంద‌రు చూసి అరే అచ్చం నాగార్జున మాదిరిగా ఉన్నాడ‌ని వైర‌ల్ చేశారు. అయితే ఇత‌ను కూడా హీరో నాగార్జ‌న గురించి తెలుసుకొని ఆయ‌న బాడీ లాంగ్వేజ్, మాట్లాడే విధానంతో వీడియోలు చూస్తూ మంచి పాపుల‌ర్ సంపాదించాడు. ప్ర‌స్తుతం అత‌ని వీడియోల‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. అత‌ను యూట్యూబ్ ఛాన‌ల్ ద్వారానే నెల‌కు రెండు నుండి మూడు ల‌క్ష‌ల రూపాయ‌లు సంపాదిస్తున్న‌ట్టు స‌మాచారం. నాగార్జున ఫీచర్స్ తో పుట్టిన జైన్ అక్మల్ ఖాన్ ఇప్పుడు హ్యాపీగా వీడియోలు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ జీవితంలో సంతోషంగా ఉన్నాడు.