కాంతార హీరో, సలార్ దర్శకుడితో కనిపించిన ఎన్టీఆర్.. ఏంటి ఈ కాంబోలో సినిమా రాబోతుందా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఇప్పుడు దేవర చిత్రంతో తన క్రేజ్‌ని మరింత పెంచుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ తన డాన్స్ తో, నటనతో మాటలతో పాటలతో ఆకట్టుకుంటూ దేశవ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఎంతో మంది ప్రేక్షకాదరణ పొందాడు. ఎన్టీఆర్ బాలీవుడ్‌లో కూడా వార్2 అనే చిత్రం చేస్తున్నాడు. త్వరలో ఈ మూవీ షూటింగ్‌లో కూడా పాల్గొననున్నాడు.
మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోను జూనియర్ ఎన్టీఆర్ చిత్రం చేయనున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ సినిమాకి సంబంధించిన కథ సిద్ధమైందని త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అఫీషియల్ ప్రకటన కూడా రానుందని సమాచారం.అయితే ఈ మధ్య కాలంలో ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ ఎక్కువగా కలిసి కనిపించడం మనం చూస్తూ ఉన్నాం.తాజాగా వీరిద్దరు ఓ ప్రైవేట్ పార్టీలో మళ్లీ కలిసారు. ఫ్యామిలీస్‌తో ఆ పార్టీకి వచ్చిన వీరు కలిసి ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
ఇక ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్‌తో కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి కూడా పిక్ దిగాడు.ఈ పిక్ కూడా నెటిజన్స్‌ని ఆకట్టుకుంటుంది. ఎన్టీఆర్ గత కొద్ది రోజులుగా దేవర అనే భారీ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉండగా ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకున్నారు. అయితే ఈ బ్రేక్ లో ఎన్టీఆర్ ఓ ప్రైవేట్ పార్టీకి హాజరు కావడం కన్నడ స్టార్స్‌తో ఫొటోలు దిగడం జరిగింది. ఎన్టీఆర్ పై కొన్ని పిక్స్ బయటకు రాగా, అవి వైరల్ గా మారాయి. ముగ్గురు స్టార్స్ కలిసి ఉన్న పవర్ఫుల్ పిక్ ఫ్యాన్స్ లో మంచి వైరల్ గా మారింది. ఇక నీల్ అయితే రీసెంట్ గానే సలార్ తో భారీ హిట్ అందుకోగా నెక్స్ట్ ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక రిషబ్ శెట్టి కాంతార ప్రీక్వెల్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.