ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఆ కోరిక తీర‌లేదు.. కావ‌ల‌నే కొంద‌రు అడ్డుకున్నారు అంటూ పూన‌మ్ సంచ‌ల‌న కామెంట్స్

  • By: sn    breaking    Mar 04, 2024 11:04 AM IST
ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఆ కోరిక తీర‌లేదు.. కావ‌ల‌నే కొంద‌రు అడ్డుకున్నారు అంటూ పూన‌మ్ సంచ‌ల‌న కామెంట్స్

టాలీవుడ్ హీరోయిన్ పూన‌మ్ కౌర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ‘శౌర్యం’, ‘వినాయకుడు’ లాంటి హిట్ సినిమాలతో ప్రేక్ష‌కుల‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న పూనమ్ ఆ త‌ర్వాత సినిమాల‌కి దూరంగా ఉంటూ కాంట్ర‌వ‌ర్సీస్‌తో హాట్ టాపిక్‌గా నిలుస్తూ ఉంటుంది. సోష‌ల్ మీడియా వేదిక‌గా సామాజిక, రాజకీయ అంశాల మీద మాత్రం ధైర్యంగా పోస్ట్‌లు పెడుతూ ఉంటుంది.ఆమెని ఎవ‌రు ఎన్ని ర‌కాలుగా ట్రోల్స్ చేసిన కూడా పూన‌మ్ కౌర్ ఏ మాత్రం వెన‌క‌డుగు వేయ‌కుండా తాను చేయాల్సిన ప‌నులు చేస్తూనే ఉంది. ఈ అమ్మ‌డు ఎక్కువ‌గా జనసేనాని పవన్ కల్యాణ్​, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద కాంట్రవ‌ర్షియ‌ల్ కామెంట్స్ చేస్తుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం.

అయితే కొన్ని సార్లు పూన‌మ్ కౌర్ ట్వీట్ చూస్తుంటే ఆమెకి పవన్, త్రివిక్రమ్​తో ఏదో గొడ‌వ ఉన్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. కాని ఆ గొడ‌వ ఏంటో ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌ట‌కు రాలేదు. గతంలో పూనమ్ కౌర్ ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయ‌గా, ఆ వ్యాఖ్య‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. తాను ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఓ సినిమా చేయాల‌ని చాలా ప్ర‌య‌త్నించింద‌ట‌. ఆయ‌న స‌ర‌స‌న న‌టించేందుకు అవ‌కాశం వ‌స్తుందేమోన‌ని క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూసింద‌ట‌. కానీ కొందరు కావాలని తనను అడ్డుకున్నారంటూ త‌న ఆవేద‌న వ్య‌క్తం చేసింది పూన‌మ్.

పవన్ కళ్యాణ్ తో కలిసి నటించాలనే కోరిక తీరని క్ర‌మంలోనే పూన‌మ్ ఆయ‌న‌పై ఇన్‌డైరెక్ట్ పోస్ట్‌లు పెడుతూ ఉందా అని న‌లుగురు ముచ్చ‌టించుకుంటున్నారు. రీసెంట్‌గా పూన‌మ్ ‘యూజ్​లెస్​ ఫెల్లో’ అంటూ త్రివిక్రమ్ పేరును ట్యాగ్ చేసి ఓ పోస్ట్‌కి రిప్లై ఇచ్చింది.ఎప్పుడు గురూజీ అంటూ త్రివిక్ర‌మ్ పై సెటైర్స్ వేసే ఆమె ఈ సారి మాత్రం డైరెక్ట్‌గా ఆయ‌న పేరు తీసి తిట్ట‌డం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే పూన‌మ్ కామెంట్స్‌పై త్రివిక్రమ్ కాని, ప‌వ‌న్ కాని ఎప్పుడు స్పందించిలేదు. వారు ఈమె కామెంట్స్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోయిన ఎందుకు ఇలా ట్వీట్స్ చేస్తుంద‌ని ఓ చ‌ర్చ కూడా ఇండ‌స్ట్రీలో నడుస్తుంది.