ఏంటి.. ప్రభాస్ డూప్ స్టార్ హీరోలని మించి సంపాదిస్తున్నాడా..!

స్టార్ హీరోలు కొన్ని రిస్కీ స్టంట్స్ చేసే సమయంలోనో లేదంటే డేంజరస్ సన్నివేశాల కోసం డూప్స్ వాడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు చాలా మంది హీరోలు డూప్‌ని వాడుతుంటారు. అయితే వారి సంపాదన ఎంత ఉంటుంది, లక్షల్లో సంపాదిస్తారా లేకుంటే వారి సంపాదన చాలా తక్కువగా ఉంటుందా అనేది చాలా మందికి తెలియని ప్రశ్న. మిగతా హీరోల డూప్ సంగతేమో కాని ప్రభాస్ డూప్ మాత్రం లక్షలు సంపాదిస్తున్నాడని టాక్. యంగ్ రెబల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ఆయన నాలుగు పదుల వయస్సు వచ్చిన కూడా పెళ్లి జోలికి వెళ్లకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు.
అయితే ప్రభాస్ ఇటీవల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుండగా, ఎక్కువ డూప్‌ని నమ్ముకునే పరిస్థితి వచ్చిందట. ప్రభాస్ చేసే సినిమాలన్నింటిలోను భారీ యాక్షన్ సీన్స్ ఉంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఆయన ప్రస్తుతం మోకాలి నొప్పితో పాటు నడుం నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో తప్పనిసరిగా డూప్‌పై ఆధారపడాల్సి వస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ చిత్రంలోని కొన్ని సీన్స్‌ని డూప్‌తో లాగించేశారట. ఇక నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి 2829 AD చిత్రం దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఇందులో పోరాట సన్నివేశాలు ఉండగా, వాటిని డూప్‌తోనే చేస్తున్నట్టు టాక్ నడుస్తుంది.
అయితే ప్రభాస్ డూప్ ఎంత పుచ్చుకుంటారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా డూప్‌లకి రోజుకి లక్ష చొప్పున ఇస్తారని టాక్. ఆ రకంగా చూస్తే ప్రభాస్ తన ప్రతి సినిమా కోసం డూప్‌ని నెల రోజులు పైనే వాడతాడట. దీంతో ఈజీగా ముప్పై లక్షలు సంపాదిస్తాడని అంటున్నారు. మనోడి సంపాదన బాగానే ఉందిగా అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. మరి ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో తెలియదు కాని ఈ వార్త నెట్టింట తెగ వైరల్‌గా మారింది. బాహుబలి లో సైతం ప్రభాస్ డూప్ ని వాడటం మనం చూశాం. ఈ మూవీ నుండే ప్రభాస్ తన డూప్‌ని ఎక్కువగా వాడుతున్నట్టు తెలుస్తుంది.. ఇక ప్రభాస్ రెమ్యునరేషన్ విషయానికి వస్తే… సినిమాకు ఆయన రూ. 100 నుండి రూ. 150 కోట్లు తీసుకుంటున్నాడు. ఇక ప్రభాస్ నటించిన కల్కి, రాజా సాబ్ చిత్రాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.