CM KCR | సీఎం కేసీఆర్ వ్య‌వ‌సాయ క్షేత్రంలో నేటి నుంచి రాజ‌శ్యామ‌ల యాగం

CM KCR | సీఎం కేసీఆర్ వ్య‌వ‌సాయ క్షేత్రంలో నేటి నుంచి రాజ‌శ్యామ‌ల యాగం

CM KCR | హైద‌రాబాద్ : సిద్దిపేట జిల్లా ఎర్ర‌వ‌ల్లిలోని ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్య‌వ‌సాయ క్షేత్రంలో బుధ‌వారం నుంచి మూడు రోజుల పాటు రాజ‌శ్యామ‌ల యాగం నిర్వ‌హించ‌నున్నారు. విశాఖ శార‌దా పీఠాధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో యాగానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ‌, ఏపీ, క‌ర్ణాట‌క రాష్ట్రాల‌కు చెందిన ప‌ల‌వురు పీఠాధిపుతులు ఈ యాగంలో పాల్గొననున్నారు.

ఈ క్ర‌మంలో 200 మంది వైదికులు మంగ‌ళ‌వారం సాయంత్రం ఎర్ర‌వ‌ల్లి గ్రామానికి చేరుకున్నారు. బుధ‌వారం తెల్ల‌వారుజామున సంక‌ల్పంతో శ్రీకారం చుట్టారు. రెండోరోజు వేద‌పారాయ‌ణ‌లు, హోమం త‌దిత‌ర క్ర‌తువులు నిర్వ‌హిస్తారు. చివ‌రిరోజు పూర్ణాహుతి ఉంటుంది. ఈ యాగంలో కేసీఆర్ దంప‌తులు పాల్గొన‌నున్న నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం రాత్రి ఎర్ర‌వ‌ల్లికి చేరుకున్నారు.