గ్లోబల్ స్టార్ అయిన భార్యకి పాద దాసుడే.. ఉపాసన కాళ్లు పట్టుకొని రామ్ చరణ్ సేవలు

చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఆనతి కాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు అందుకున్నాడు. సినిమా సినిమాకు తన లుక్స్మారుస్తూ, నటనలో మరింత మెరుగుపడుతూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. గతేడాది ఆర్ఆర్ఆర్చిత్రంతో మెగా పవర్ స్టార్‌గా ఉన్న ఆయన ఏకంగా గ్లోబల్ స్టార్‌గా మారి తన క్రేజ్ ఎల్లలు దాటేలా చేశాడు. చిత్రంలో రూత్‌లెస్ పోలీస్ ఆఫీసర్‌గా తన పర్ఫెక్ట్లుక్ అండ్ సూపర్ యాక్టింగ్‌తో హాలీవుడ్దర్శక నిర్మాతల్నిసైతం మంత్ర ముగ్ధులని చేశారు. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు.
గత కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు చరణ్. ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీకి కొంత సమయాన్ని తప్పక కేటాయిస్తుంటాడు చరణ్. తన భార్యతో సరదాగా చక్కర్లు కొడుతుండడం అలానే పలు ఈవెంట్స్‌లో పాల్గొని సందడి చేయడం మనం చూస్తూనే ఉన్నాం.రీసెంట్‌గా రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనని తీసుకొని జామ్ నగర్ వెళ్లారు. అనంత్ అంబానీ పెళ్లి కోసం ప్రత్యేకంగా విమానంలో వెళ్లారు. ఈ జర్నీలో ఉపాసన శ్రీవారి సేవలు పొందింది. ఏ మాత్రం ఇగో లేని రామ్ చరణ్ తన సతీమణి పాదాలు పట్టుకొని సేవలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారంది. క్యూట్ కపుల్స్ అంటూ జనాలు పొగిడేస్తున్నారు.
గ్లోబల్ స్టార్ అయిన భార్యకి పాద దాసుడే.. ఉపాసన కాళ్లు పట్టుకొని రామ్ చరణ్ సేవలుమరి కొందరు ఎంత పెద్దటి గ్లోబల్ స్టార్ అయిన కూడా భార్యకి పాదదాసుడే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.వెండితెరని పులిలా వేటాడే చరణ్ ఈ వీడియోలో ఉపాసన దగ్గర చిన్నపిల్లాడిలా మారిపోయి సేవలు చేస్తుండడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.రామ్ చరణ్ ఎంత డౌన్ టు ఎర్త్‌గా ఉంటాడో మనకు తెలిసిందే. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు.. భార్యకు ఎంత విలువ ఇస్తాడు అని చెప్పడానికి తాజా వీడియోనే నిదర్శనం అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ వీడియోని ఎవరు తీశారు? ఎలా బయటకు వచ్చిందన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ అనే సినిమాతో బిజీగా ఉన్నారు.