త‌గ్గేదే లే అంటున్న రామ్ చ‌ర‌ణ్ దంపతులు..కెరీర్‌లో మ‌రో మైలు రాయి..!

త‌గ్గేదే లే అంటున్న రామ్ చ‌ర‌ణ్ దంపతులు..కెరీర్‌లో మ‌రో మైలు రాయి..!

టాలీవుడ్‌లో మోస్ట్ ల‌వబుల్ క‌పుల్‌గా పిల‌వ‌బ‌డుతున్న రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తులు ఇటీవ‌లి కాలంలో తెగ వార్త‌ల‌లో నిలుస్తున్నారు. పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన త‌ర్వాత పాప ఫేస్ క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం ఈ జంట ముంబైలో ఉన్నారు. గ‌త రోజుల నుండి అక్క‌డే ఉంటున్న ఈ జంట అక్క‌డ ఆల‌యాన్ని సంద‌ర్శించుకోగా, అందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఇక శుక్రవారం ఉదయం ముంబైలోని మహారాష్ట్ర సీఎం కార్యాలయాన్ని సందర్శించారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ను సీఎం కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వారికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ప‌ర్స‌న‌ల్ విష‌యాల కోస‌మే సీఎంని క‌లిసిన‌ట్టు ప్ర‌చారం న‌డుస్తుంది.

ఇక మ‌హారాష్ట్ర సీఎంని క‌లిసిన పిక్స్ త‌న ఇన్‌స్టాలో షేర్ చేసిన రామ్ చ‌ర‌ణ్‌.. తమకు ఆతిథ్యం ఇచ్చిన షిండేకి, ఆయన కొడుకు శ్రీకాంత్ షిండేలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముంబై ప్రజలు తమపై కురిపించిన ప్రేమ, ఆప్యాయత, అభిమానానికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియ‌జేస్తున్న‌ట్టు పేర్కొన్నారు. ఇక ఇదిలా ఉంటే రామ్ చ‌ర‌ణ్‌కి ఈ ఏడాది చాలా క‌లిసి వ‌స్తుంది. ఆయ‌న ప‌ట్టింద‌ల్లా బంగారం అవుతుంది. ఇప్ప‌టికే తాను న‌టించిన సినిమాకి ఆస్కార్ ద‌క్క‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేసిన రామ్ చ‌ర‌ణ్ తాజాగా మ‌రో అరుదైన ఘ‌న‌త సాధించారు. ఫోర్బ్స్ మేగజీన్‌ పైకి ఎక్కారు.ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన లేటెస్ట్ ఎడిషన్‌ మేగజీన్‌పై భార్య ఉపాసనతో కలిసి చరణ్‌ ఫోర్బ్స్ మేగజీన్‌ కవర్‌ పేజ్‌పైకి రావడం అందరి దృష్టిని ఆక‌ర్షిస్తుంది.

తాజా ఎడిష‌న్‌లో ప్ర‌త్యేక సంచిక ప్ర‌చ‌రితం కాగా, అందులో రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న ఒక‌రికి సంబంధించి మ‌రొక‌రు అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వారి పరిచయం, లవ్‌, పెళ్లి, వ్యాపారాలు, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఇలా అన్నింటి గురించి అందులో చ‌ర్చింగా, ఇప్పుడు ఇది అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. రామ్ చ‌ర‌ణ్ తాజాగా సాధించిన ఈ ఘ‌న‌త ప‌ట్ల ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక చ‌ర‌ణ్ సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం `గేమ్‌ ఛేంజర్‌` చిత్రంలో నటిస్తున్నారు. శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయిక. ఇది చిత్రీకరణ దశలో ఉంది. వచ్చే ఏడాది మిడ్‌లో రిలీజ్‌ కానుండ‌గా, ఈ సినిమా త‌ర్వాత బుచ్చిబాబుతో క‌లిసి క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు.