రాత్రిళ్లు సెక్యూరిటీ జాబ్.. ప‌గ‌లు అవకాశాలు కోసం తిర‌గడం చేసాన‌నన్న క‌మెడీయ‌న్

  • By: sn    breaking    Nov 02, 2023 10:57 AM IST
రాత్రిళ్లు సెక్యూరిటీ జాబ్.. ప‌గ‌లు అవకాశాలు కోసం తిర‌గడం చేసాన‌నన్న క‌మెడీయ‌న్

సినిమా ప‌రిశ్ర‌మ అనేది రంగుల ప్ర‌పంచం. వెండితెర‌పై అల‌రించే ఆర్టిస్ట్‌లని చూసి మ‌నం కూడా సినిమాల‌లోకి వెళితే బాగుంటుంది అని చాలా మంది అనుకుంటారు. కాని అది అంత ఈజీ కాదు. ఇప్పుడు వెండితెర‌, బుల్లితెర‌పై ఓ వెలుగు వెలుగుతున్న చాలా మంది స్టార్స్ ఎన్నో క‌ష్టాలు ప‌డి ఈ స్థాయికి చేరుకున్నారు. వారిలో తాగుబోతు ర‌మేష్ కూడా ఒకరు. అత‌ని ఒరిజిన‌ల్ నేమ్ రామిల్ల ర‌మేష్ కాగా, తాగుబోతు పాత్ర‌లు ఎక్కువ‌గా చేస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న నేమ్ తాగుబోతు ర‌మేష్‌గా మారింది. జ‌గ‌డం చిత్రంతో తొలిసారి వెండితెర‌పై అవ‌కాశం ద‌క్కించుకున్న ర‌మేష్ మ‌ళ్లీ వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. అప్ అండ్ డౌన్స్ వ‌స్తున్నా కూడా కెరీర్‌లో ఏ రోజు చ‌తికిల‌ప‌డింది లేదు.

ఈ మ‌ధ్య టీవీ కామెడీ షో `జబర్దస్త్`ని వాడుకుంటూ అందులో తన కామెడీతో నవ్వులు పూయిస్తున్నాడు. ప్ర‌స్తుతం జ‌బ‌ర్దస్త్ షోని, మరోవైపు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే తాజాగా ఆయ‌న శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి హాజ‌రు కాగా, ఈ షోలో త‌ను ఎంత స్ట్ర‌గుల్స్ ఫేస్ చేసాడో వివ‌రించాడు. ఎలాంటి పరిస్థితుల నుంచి హైదరాబాద్‌కి వచ్చాడు, ఎలా సినిమాల్లోకి వచ్చాడనేది ర‌మేష్ చెప్పుకొచ్చి అంద‌రు ఎమోష‌న‌ల్ అయ్యేలా చేశాడు. తాను సినిమాల‌లోకి రాక‌ముంద ప్రొక్లెయినర్‌ నడిపిన‌ట్టు చెప్పుకొచ్చాడు. అలానే లారీలు నడిపినా, జీపులు నడిపిన.. హైదరాబాద్‌కి వచ్చిన ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌ చేసిన అని అన్నాడు. సినిమా అవ‌కాశాలు రావ‌డం అంత ఈజీ కాదు. అందుకే రాత్రి సమయంలో సెక్యూరిటీ జాబ్‌ చేసినా, పగలు ఫోటోలు పట్టుకుని సినిమా అవ‌కాశాలు కోసం తిరిగాను. ఆ క్ర‌మంలోనే జ‌గ‌డం మూవీ ఛాన్స్ వ‌చ్చింద‌ని ర‌మేష్ స్పష్టం చేశాడు.

ఇప్పుడు ఈ స్థానం చేరుకోవ‌డానికి తాను ఎన్నో ర‌కాలు బాధ‌లు ప‌డ్డట్టు తెలియ‌జేశాడు. రమేష్‌ తన బాధల‌ని వ్య‌క్త‌ప‌రుస్తూ కన్నీళ్లు పెట్టుకోవడం అందరిని కదిలించింది. ఆయనే కాదు కావ్య, నిఖిల్‌ వంటి వారు కూడా తమ కష్టాలను చెప్పుకుంటూ అందరి హృదయాలను కదిలించారు. ఇక తాగుబోతు రమేష్‌.. `మీటర్‌`, `రామన్న యూత్`, `నా నేను` చిత్రాల్లో న‌టిస్తున్నారు. అయితే గ‌తంలో మాదిరిగా ర‌మేష్ పాత్ర‌లు అంత‌గా హైలైట్ కావ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో అవ‌కాశాలు కూడా అంత‌గా రావ‌డం లేదు.