రైతుబిడ్డ దెబ్బ‌కి ర‌తిక బ‌లి.. ప్ర‌శాంత్ ఎవిక్ష‌న్ పాస్‌పై అంద‌రి దృష్టి

రైతుబిడ్డ దెబ్బ‌కి ర‌తిక బ‌లి.. ప్ర‌శాంత్ ఎవిక్ష‌న్ పాస్‌పై అంద‌రి దృష్టి

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 7 కార్య‌క్ర‌మం సక్సెస్‌ఫుల్‌గా ప‌న్నెండు వారాలు పూర్తి చేసుకుంది. ఈ వారం డ‌బుల్ ఎలిమినేట్ ఉంటుంద‌ని ముందుగానే నాగార్జున చెప్పగా, ఆయ‌న చెప్పిన‌ట్టుగానే డ‌బుల్ ఎలిమినేష‌న్ జరిగింది. శ‌నివారం అశ్విని హౌజ్ నుండి బ‌య‌ట‌కు వెళ్లిపోగా, ఆదివారం ర‌తిక ఎలిమినేట్ అయింది. దీంతో బిగ్ బాస్ హౌస్ నుంచి రతికను రెండుసార్లు బయటకు పంపించిన ఘనత పల్లవి ప్రశాంత్‌కే ద‌క్కింది అని చెప్పాలి. ర‌తిక మొద‌టిసారి ఎలిమినేట్ అయింది కూడా ర‌తిక వ‌ల్ల‌నే. రెండోసారి ఆమె కోసం ఎవిక్ష‌న్ పాస్ వాడి ఉంటే సేవ్ అయి ఉండేది. కాని ప్ర‌శాంత్ అందుకు ఆస‌క్తి చూపించ‌క‌పోవ‌డంతో ర‌తిక బ‌య‌ట‌కు రావ‌ల్సి వ‌చ్చింది.

ర‌తిక‌, ప్ర‌శాంత్ మొద‌ట్లో చాలా క్లోజ్‌గా ఉండేవారు కాని త‌ర్వాత త‌ర్వాత ఇద్ద‌రికి చెడింది. 12 వారంలో రతిక, ప్రశాంత్‌.. ఒకరిని ఒకరు నామినేట్‌ చేసుకున్నారు. చివరకు ఇద్దరూ నామినేషన్స్‌లోకి వచ్చారు. అయితే టాస్కుల్లో గెలిచిన ప్రశాంత్‌ ఎవిక్షన్‌ పాస్‌ గెల్చుకున్నాడు. కాని ర‌తిక మాత్రం బ‌య‌ట‌కు రావ‌ల్సి వచ్చింది. మొదట 28వ రోజుకే బిగ్ బాస్ హౌజ్‌ని వీడింది ర‌తిక‌. వైల్డ్ కార్డు ఎంట్రీతో 49వ రోజు మళ్లీ హౌజ్‌లోకి వ‌చ్చిన ర‌తిక 35రోజులు హౌజ్ లో ఉండి 84వ రోజున ఎలిమినేట్ అయ్యింది. దీంతో హౌజ్ లో ప్ర‌స్తుతం ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఉన్నారు. మ‌రి ఈ సారి ఫైన‌ల్‌కి ఏడుగురుని ఉంచుతార‌నే ప్రచారం జ‌రుగుతుండ‌గా, ఇందులో ఎంత నిజం ఉంద‌నేది చూడాలి.

ఇక ఆదివారం ఎపిసోడ్‌లో నాగార్జున ఎప్ప‌టి మాదిరిగానే హౌజ్‌మేట్స్‌తో స‌ర‌దా గేమ్స్ ఆడించారు.హౌజ్‌మేట్స్‌ని స్పా బ్యాచ్, స్పై బ్యాచ్ గా విడదీశారు నాగ్ . వీరితో క్విజ్ పోటీని ఆడించారు. ఒక్కొక్కరికి మార్కులు అందించారు. అర్జున్ సంచాలకుడిగా ఉండ‌గా, మిగ‌తా కంటెస్టెంట్స్ గేమ్ ఆడారు. హౌజ్ లోని వస్తువులు, ఇంటిరియర్, ఫర్నీచర్, తదితర వస్తువులపై ఉన్న కలర్ తదితర అంశాలను ప్రశ్నలుగా అడ‌గ‌గా,ఈ క్విజ్ పోటీలో స్పై బ్యాచ్ గెలిచింది. ఇలా మరిన్ని గేమ్స్ తో హౌజ్ లో సందడి నెలకొన‌గా, ఆదివారం మంచి ఫన్ ద‌క్కింది అనే చెప్పాలి.