నోరు జారిన అమర్.. మంచిగా మాట్లాడు అంటూ వార్నింగ్ ఇచ్చిన రతిక

బిగ్ బాస్ షోలో ప్రస్తుతం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నడుస్తుంది. ఈ టాస్క్ కోసం ఇంటి సభ్యులని రెండు గ్రూపులుగా విభజించారు బిగ్ బాస్. వీరసింహాలు టీమ్‌లో రతిక, గౌతమ్, శోభా, భోలే, యావర్, తేజ ఉండగా, గర్జించే పులులు టీమ్ లో శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రియాంక, అశ్విని, అర్జున్, అమర్ ఉన్నారు. అయితే తొలి రౌండ్‌లో వీరసింహాలు టీమ్ గెలవడంతో గర్జించే పులులు టీమ్ నుండి ప్రశాంత్‌ని తప్పించారు. ఇక తాజా ఎపిసోడ్‌లో మళ్లీ బంతులు వేసి సేకరించమని అన్నారు. అయితే వాటిని సేకరించించేకు ఇరు టీమ్స్ కి సంచులు కావాల్సి ఉండగా, ముందుగా స్టోర్ రూమ్ లోకి వెళ్లి ప్రత్యర్ధి టీమ్ సంచులని తీసుకొచ్చారు అమర్. అయితే సంచుల విషయంలో రతిక-అమర్ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది.
సంచులు ఎందుకు పడేశావ్ అని రతిక.. అమర్‌పై ఆగ్రహం వ్యక్తం చేయగా, అది నా స్ట్రాటజీ అని చెప్పుకొచ్చాడు. ఎదవ పని చేసి స్ట్రాటజీ అని అనకు అంటూ రతిక ఫైర్ అయింది. దానికి అమర్ నువ్వు చేసే ఎదవ పనులు చూసి బయట ఊస్తున్నారు అంటూ అమర్ నోరు జారాడు. మాటలు జాగ్రత్తగా రానీ అని రతిక హెచ్చరించిన, అమర్ కూడా తగ్గలేదు. ఇద్దరి మధ్య గొడవ పర్సనల్ వరకూ వెళ్ళింది. అనంతరం బిగ్ బాస్ ‘బ్రేక్ ఇట్ ఎయిమ్ లో’ అనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో భాగంగా బాక్స్ బద్దలు చేసి అందులో ఉన్న సంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక సంచిలో ఉన్న కర్రలను పైనుండి గురి చూసి కింద ఉన్న గొట్టాల్లో పడేలా వేయాలి.
ఇరు టీమ్స్ ఏక కాలంలో గేమ్ ఆడగా, ముందుగా టాస్క్ పూర్తి చేసినవారు విన్నర్ అవుతారని బిగ్ బాస్ తెలియజేశారు. గర్జించే పులులు నుండి అర్జున్, అమర్… వీర సింహాలు నుండి శోభా, గౌతమ్ ఈ గేమ్ ఆడగా, ఈ టాస్క్‌లో ముందుగా గర్జించే పులులు టీమ్ టాస్క్ పూర్తి చేసి విన్నర్ అయ్యారు. దీంతో బిగ్ బాస్ వాళ్లకు ప్రత్యేకమైన పవర్ ఇచ్చాడు. ఈ పవర్‌తో వీరసింహాలు టీమ్లోని ఒకరిని డెడ్ చేయవచ్చు లేదా వారి నుండి 500 బాల్స్ తీసుకోవచ్చు అని చెప్పారు. అప్పుడు గర్జించే పులులు టీమ్ 500 బాల్స్ తీసుకునే ఆప్షన్ తీసుకున్నారు. ఆ తర్వాత తిరిగి పై నుండి బాల్స్ పడగా, వాటిని సేకరించారు. అయితే గోల్డెన్ బాల్ ఎవరి వద్ద ఉందని బిగ్ బాస్ అడగగా, అది వీర సింహాలు టీమ్ వద్ద ఉంది. దాంతో వాళ్లకు మరో పవర్ దక్కింది. తమ టీమ్ లోని వీక్ ప్లేయర్ ని ప్రత్యర్థి టీమ్ లోని ప్లేయర్ తో మార్పిడి చేసుకోవచ్చుఅని చెప్పగా, దాంతో వీర సింహాలు టీమ్ భోలేని పక్క టీమ్‌లోకి పంపి గర్జించే పులులు టీమ్ నుండి అర్జున్ ని తీసుకున్నారు. ఇక ఆట మొదలు కాగా, శివాజీ తన బంతులు తీసుకుంటే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చాడు. తేజ ఇది కూడా ఆటలో భాగమే అని అన్నాడు. ఇక రాత్రిపూట గర్జించే పులులు టీమ్ దగ్గర ఉన్న బాల్స్ ని వీర సింహాలు టీమ్ దొంగిలించే ప్రయత్నం చేశారు..