మ‌న‌సంతా నువ్వే హీరోయిన్‌కి అంత పెద్ద కొడుకు ఉన్నాడా.. చూస్తే షాక‌వ్వాల్సిందే..!

  • By: sn    breaking    Jan 06, 2024 12:42 PM IST
మ‌న‌సంతా నువ్వే హీరోయిన్‌కి అంత పెద్ద కొడుకు ఉన్నాడా.. చూస్తే షాక‌వ్వాల్సిందే..!

ఉద‌య్ కిర‌ణ్ హీరోగా తెర‌కెక్కి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన చిత్రం మ‌న‌సంతా నువ్వే.వి.ఎన్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రీమా సేన్ క‌థానాయిక‌గా న‌టించింది. 2001 లో విడుదల అయిన ఈ సినిమా సంచలన విజయం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రీమాసేన్ తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన త‌ర్వాత అదే ఏడాది గౌతమ్ వాసుదేవ్ డైరెక్షన్ లో ‘మిన్నెలే’ సినిమాతో తమిళ ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యింది.ఇక అక్క‌డ విజ‌య్ భ‌గ‌వ‌తి, విశాల్ చెల్ల‌మే, లాంటి సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. మంచి పేరు కూడా తెచ్చుకుంది రీమా సేన్.

ఇక హీరోయిన్‌గా మంచి అవ‌కాశాలు వ‌స్తున్న స‌మ‌యంలోనే రీమా సేన్ 2012లో పెళ్ళి చేసుకుని సినిమాలకు దూరం అయ్యింది శివ కరణ్ సింగ్ అనే వ్యాపారవేత్తను పెళ్ళాడి అనంత‌రం పూర్తిగా సినిమాల‌కి దూర‌మైంది ఈ బెంగాల్ బ్యూటీ. ఇక ఫ్యామిలీకే పూర్తి స‌మ‌యం కేటాయిస్తూ 2013లో మగబిడ్డకి జ‌న్మ‌నిచ్చింది. అతనికి రుద్రవీర్ అని పేరు కూడా పెట్టారు. అయితే ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండ‌క‌పోవ‌డంతో రీమా సేన్‌ని ప‌ట్టించుకోవ‌డ‌మే మానేశారు. అయితే ఇటీవ‌ల కొంద‌రు ఆమె గురించి ఆరాలు తీసే ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలో ఆమె ఫ్యామిలీ పిక్స్ సోష‌ల్ మీడియాలో క‌నిపించాయి.

పిక్స్‌లో రీమా సేన్ త‌న‌యుడు కూడా ఉండ‌గా, అప్పుడే అంత పెద్ద వాడు అయ్యాడా అంటూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. రీమాసేన్‌కి అంత పెద్ద కొడుకు ఉన్నాడా అంటూ కొంద‌రు ఆశ్చ‌ర్యం వ్యక్తం చేస్తున్నారు. రీమా సేన్ తనయుడు రుద్వీర్ పెరిగి పెద్దవాడవుతుండగా తాజాగా అతడి ఫోటో చూసిన అభిమానులు , నెటిజన్స్ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. కొడుకు పెద్ద‌గా అయ్యాడు కాబ‌ట్టి ఇక ఇప్పుడు రీమాసేన్ తిరిగి సినిమాల‌లో స‌త్తా చాటాలని భావిస్తుంది. హీరోయిన్ అవ‌కాశాలు క‌ష్టం కాబ‌ట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు వస్తే చేయడానికి రెడీ అంటుందట. మరీ ముఖ్యంగా టాలీవుడ్ లో ఆమె అవకాశాల కోసం చూస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది.