రాజ్యాంగ ర‌క్ష‌ణ కోసం.. బీఆర్ఎస్‌లో చేరుతున్నా : ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్

రాజ్యాంగ ర‌క్ష‌ణ కోసం.. బీఆర్ఎస్‌లో చేరుతున్నా : ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్

హైద‌రాబాద్ : బీఎస్పీ మాజీ అధ్య‌క్షుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ సోమ‌వారం గులాబీ గూటికి చేరుకోనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స‌మక్షంలో ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ గులాబీ కండువా క‌ప్పుకోనున్నారు. ఈ విష‌యాన్ని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఎక్స్ వేదిక‌గా ఆదివారం రాత్రి వెల్ల‌డించారు.

త‌న రాజ‌కీయ భ‌వితవ్యంపై వంద‌లాది శ్రేయోభిలాషులు, ఆప్తులు, అభిమానులంద‌రితో మేధోమ‌ధ‌నం జ‌రిపాను. ఈ చ‌ర్చ‌లో ర‌క‌ర‌కాల అభిప్రాయాలు వ‌చ్చాయి. కానీ త‌న మీద న‌మ్మ‌కంతో తాను ఏ నిర్ణ‌యం తీసుకున్న తన వెంట‌నే న‌డుస్తామ‌ని మాట ఇచ్చిన అంద‌రికీ హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. తెలంగాణ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, దేశంలో లౌకికత్వాన్ని కాపాడడం కోసం, రాజ్యాంగ రక్షణ కోసం, బహుజనుల అభ్యున్నతి కోసం తాను సోమ‌వారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స‌మ‌క్షంలో గులాబీ పార్టీలో చేరుతున్నాను. తాను ఎక్కడున్నా బహుజన మహనీయుల సిద్దాంతాన్ని గుండెలో పదిలంగా దాచుకుంటా. వాళ్ల కలలను నిజం చేసే దిశగా పయనిస్తా. దయచేసి నిండు మనసుతో ఆశీర్వదించండి. జై భీం.. జై తెలంగాణ.. జై భారత్ అని ప్ర‌వీణ్ కుమార్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.