సలార్ బడ్జెట్ అన్ని కోట్లు అయితే, అందులో సగం యాక్టర్స్‌కే ఇచ్చారా..!

వరుస ఫ్లాపుల తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన సలార్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతుంది. ఈ చిత్రంకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా, శృతి హాసన్ కథానాయికగా నటించింది.బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ హిట్ కోసం ఆవురావురుమంటూ ఆకలితో ఎదురుచూసిన అభిమానులకి సలార్ ఆ ఆకలిని తీర్చిందనే చెప్పాలి. హోంబళే ఫిల్మ్స్ నిర్మాణ సంస్థలో వచ్చిన సలార్ మూవీలో భారీ తారాగణం నటించగా, వారందరు కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. అన్ని భాషలకి చెందిన నటీనటులు ఈ సినిమాలో ఉండడంతో పాన్ ఇండియా మూవీ అందరిని ఎంతగానో అలరిస్తుంది.
సలార్ సీజ్‌ఫైర్ మూవీలో ప్రభాస్‌తోపాటు మలయాళ పాపులర్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలలో కనిపించి సందడి చేశారు. హీరోయిన్ శ్రుతిహాసన్, జగపతిబాబు, బాబీ సింహా, బ్రహ్మాజీ, ఈశ్వరీ రావు, మైమ్ గోపీ, యాంకర్ ఝాన్సీ తదితరులు నటించారు.దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించింది హోంబలే ఫిల్స్మ్. విడుదలకు ఎలాంటి ఈవెంట్స్, ప్రెస్ మీట్స్, ప్రమోషన్స్ లేకుండానే డైరెక్ట్‌గా సినిమా విడుదల చేసి పెద్ద సాహసమే చేశారు. రిలీజ్‌కి ముందు విడుదలైన ట్రైలర్‌తో మూవీపై అంచనాలు పీక్స్‌కి చేరుకున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా ఈ చిత్రం రికార్డ్స్ క్రియేట్ చేసింది సలార్. అయితే చిత్రంలో నటించిన నటీనటుల రెమ్యునరేషన్స్ గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
ఇక సలార్ మూవీ బడ్జెట్ దాదాపు రూ. 400 కోట్లకు చేరిందని ఓ టాక్ వినిపిస్తుండగా, గూగుల్ మాత్రం రూ. 270 కోట్లు అని చూపిస్తోంది. కాబట్టి, సలార్ బడ్జెట్ విషయంలో క్లారిటీ లేదు. అయితే మొత్తం రూ.400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకు.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రూ.100 కోట్లు పారితోషికం తీసుకున్నాడని టాక్ నడుస్తుంది. అంతేకాదు లాభాల్లో 10 శాతం షేర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దాదాపు రూ.50 కోట్లు ఇచ్చారని టాక్. ఇక ఈ సినిమాలో కథానాయిక ఆద్య పాత్రలో కనిపించిన శ్రుతిహాసన్.. రూ.8 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుందట. అలాగే కీలకపాత్రలలో నటించిన జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇద్దరూ రూ.4 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియదు.