ఏంటి త‌న క్లోజ్ ఫ్రెండ్ భ‌ర్త‌తో స‌మంత అంత రొమాన్స్ చేస్తుంది.. వీడియో చూసి షాక్

ఏంటి త‌న క్లోజ్ ఫ్రెండ్ భ‌ర్త‌తో స‌మంత అంత రొమాన్స్ చేస్తుంది.. వీడియో చూసి షాక్

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా స‌మంత ముందుకు సాగుతుంది. ఆమె కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్న‌ప్పుడే డివ‌ర్స్ కావ‌డం, అలానే మయోసైటిస్ వ్యాధి సోకడం ఆమె మ‌రింత కుంగిపోయేలా చేసింది. మ‌యోసైటిస్ వ‌ల‌న కొన్నాళ్లుగా సినిమాల‌కి దూరంగా ఉంటూ సోష‌ల్ మీడియాలోను లేదంటే ఏదైన ఇంట‌ర్వ్యూల‌లో ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేస్తూ వార్త‌ల‌లో నిలుస్తుంది. అయితే స‌మంత‌కి చాలా స‌న్నిహ‌తంగా ఉండే వారిలో చిన్మ‌యి ఒక‌రు. ఆమె స‌మంత‌కి డ‌బ్బింగ్ చెప్ప‌డంతో పాటు స‌మంత క‌ష్ట సుఖాల‌లో తోడై ఉంటుంది. స‌మంత ఈ రేంజ్‌కి రావ‌డంలో చిన్మ‌యి పాత్ర కూడా ఎంతో ఉంద‌ని చెప్పాలి. అయితే చిన్మ‌యి భ‌ర్త‌తో స‌మంత రొమాన్స్ చేయ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్, సమంతల కలిసి రొమాన్స్ చేసిన వీడియో సోష‌ల్ మీడియాని షేక్ చేసింది. ఈ వీడియోలో సమంత, రాహుల్ కలిసి తెగ రొమాన్స్ పండించారు. వీడియో బ్యాక్ గ్రౌండ్ సాంగ్ వినిపిస్తుంది. గోరే, గోరే అనే సాంగ్ అంటే మ‌న‌కు ఠ‌క్కున‌ ఇలియానా, రవితేజ కిక్ మూవీ మాత్రమే గుర్తకు వస్తుంది. తెలుగులో థమన్ అందించిన ది బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ గా ఇది నిల‌వ‌డంతో పాటు సినిమా కూడా మంచి హిట్ అయింది. కిక్ మూవీలోని గోరే అనే పాట‌కి సమంత, రాహుల్ చిందులేయడం చూసి ప్ర‌తి ఒక్క‌రు షాక్ అవుతున్నారు.

అయిన స‌మంత, రాహుల్ ఇద్ద‌రు క‌లిసి ఎప్పుడు న‌టించారు, వీరి కాంబినేష‌న్‌లో సినిమా ఎప్పుడు వచ్చింద‌ని ప‌లువురు కామెంట్స్ చేస్తున్నారు.అయితే రాహుల్ రవీంద్రన్, స‌మంత కలిసి.. మాస్కోవిన్ కావేరీ అనే చిత్రంలో నటించారు. ఇందులో స‌మంత‌, రాహుల్ మ‌ధ్య రొమాంటిక్ స‌న్నివేశాలు చాలానే ఉన్నాయి. 2007లో ఈ సినిమా తెరకెక్కగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీని చాలా ఆల‌స్యంగా విడుద‌ల చేశారు. అస‌లు ఏ మాయ చేశావే చిత్రం క‌న్నా ముందే విడుదల కావ‌ల్సి ఉన్న కొన్ని ప‌రిస్థితుల వ‌ల‌న ఏ మాయ చేశావే చిత్రం త‌ర్వాత రిలీజ్ చేశారు. దీంతో స‌మంత తొలి సినిమా ఏ మాయ చేశావేగా మారింది. ఇక ఇప్ప‌టికీ స‌మంత .. చిన్మ‌యితో పాటు ఆయ‌న భ‌ర్త‌తో మంచి స్నేహం మెయింటైన్ చేస్తుంది.