ఈమె ఎవరో కాని సమంతకి ప్రింట్‌లా ఉందిగా.. కొంపదీసి సొంత చెల్లెలు కాదు కదా?

మనుషులని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అని మనం చిన్నప్పటి నుండి వింటున్నాం. ఒకప్పుడు ఒకే మనిషిని పోలిన వాళ్లు కనిపించడం అనేది చాలా అరుదు. కాని ఇప్పుడు సోషల్ మీడియా వలన ఒక మనిషి పోలికలతో ఉన్న వేరే వ్యక్తులు ఇట్టే దర్శనమిస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీల పోలికలతో ఉన్న వ్యక్తులు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు దర్శనమిస్తూ అందరిని షాక్ అయ్యేలా చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత మాదిరిగా ఓ అమ్మాయి కనిపించడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. అచ్చం సమంత పోలికలతో ఉన్న ఆ అమ్మాయిని చూసి కొంపదీసి సమంత చెల్లెలు కాదు కదా అని కామెంట్ చేస్తున్నారు.
సమంత కొన్నేళ్ల క్రితం నాగ చైతన్యని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లైన నాలుగేళ్లకి డైవర్స్ ఇచ్చిందనుకోండి అది వేరే విషయం. అయితే సమంత నాగచైతన్యని పెళ్లి చేసుకునే సమయంలో ఎలాగైతే రెడీ అయి ఉందో అచ్చం అలాగే మరో అమ్మాయి సమంత పోలికలతోనే పెళ్లికూతురు గెటప్ లో కనిపించి అందరు షాక్ అయ్యేలా చేసింది. ఈమె కొంపదీసి సమంత చెల్లెలా ఏంటి అంటూ కొందరు నోరెళ్లపెడుతున్నారు. అయితే ఈ అమ్మాయి ఎవరో తెలియదు కాని సమంత మాదిరిగా ఉండడంతో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. గతంలో అషూ రెడ్డి సమంత పోలికలతో ఉండగా ఆమెని జూనియర్ సమంత అని అందరు చెప్పుకొచ్చేవారు.
జూనియర్ సమంతగా ఇండస్ట్రీలోకి వచ్చి మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించింది అషూ రెడ్డి. మరి ఈ అమ్మడు కూడా సమంత క్రేజ్ ఉపయోగించుకొని ఇండస్ట్రీ వైపు అడుగులేస్తుందా చూడాలి. ముందు జనాలు అసలు ఆ అమ్మాయి ఎవరు అని తెగ ఆరాలు తీస్తున్నారు. ఆమెది ఏ ప్రాంతం, ఎక్కడి మనిషి తెలుసుకునేందుకు నెట్టింట తెగ సెర్చ్‌లు చేస్తున్నారు. ఇక సమంత విషయానికి వస్తే ఆమె మయోసైటిస్ వలన సినిమాలకి ఏడాది పాటు బ్రేక్ ప్రకటించిన విషయం తెలిసిందే. మరి కొద్ది రోజులలో తిరిగి సినిమాలు చేయనుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ బికినీలతో కూడా బెంబేలెత్తిస్తుంది.