Vande Bharat Express | 8న కూతపెట్టనున్న సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్.. రైలు ఆగే స్టేషన్లు, టైమింగ్స్ ఇవే..
Vande Bharat Express | విధాత: తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ మధ్య మరో వందేభారత్ రైలు పెట్టాలెక్కబోతున్నది. ఏప్రిల్ 8న సికింద్రాబాద్ - తిరుపతి మధ్య రైలు ప్రారంభంకానున్నది. అయితే, తొలిరోజున మాత్రం ప్రయాణికులను అనుమతించరు. 10వ తేదీ నుంచి రెగ్యులర్‌గా ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నది. ప్రతి మంగళవారం మినహా వారంలో ప్రతీ రోజు వందేభారత్ అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య తొలి వందేభారత్ రైలు నడుస్తుండగా.. మంచి ఆదరణ లభిస్తుంది. […]

Vande Bharat Express |
విధాత: తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ మధ్య మరో వందేభారత్ రైలు పెట్టాలెక్కబోతున్నది. ఏప్రిల్ 8న సికింద్రాబాద్ – తిరుపతి మధ్య రైలు ప్రారంభంకానున్నది. అయితే, తొలిరోజున మాత్రం ప్రయాణికులను అనుమతించరు. 10వ తేదీ నుంచి రెగ్యులర్‌గా ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నది.
ప్రతి మంగళవారం మినహా వారంలో ప్రతీ రోజు వందేభారత్ అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే విశాఖపట్నం – సికింద్రాబాద్ మధ్య తొలి వందేభారత్ రైలు నడుస్తుండగా.. మంచి ఆదరణ లభిస్తుంది. దాంతో సికింద్రాబాద్ – తిరుపతి మార్గంలో మరో రైలును అందుబాటులోకి తేవాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.
ప్రస్తుతం తిరుపతికి హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుంటారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ – నల్గొండ-గుంటూరు-నెల్లూరు మీదుగా రైలును ప్రారంభించేందుకు నిర్ణయించారు. ప్రస్తుతం నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ సైతం ఇదే మార్గంలో నడుస్తున్నది. పలు రైళ్లు దాదాపు పది నుంచి 13 గంటల వరకు సమయం పడుతున్నది.
కొత్తగా వందేభారత్ రైలు అందుబాటులోకి రానుండడంతో ప్రయాణ సమయంలో భారీగా తగ్గనున్నది. వందే భారత్ రైలు 8.30 గంటల్లోనే గమ్యస్థానానికి చేర్చనున్నది. సికింద్రాబాద్ – తిరుపతి, తిరుపతి – సికింద్రాబాద్ మధ్య రైలు షెడ్యూల్‌ను అధికారులు అధికారికంగా ప్రకటించారు.
ప్రతి మంగళవారం మినహా ప్రతి రోజూ ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి నల్గొండకు 07.19 గంటలకు చేరుకుంటుంది. ఆ తర్వాత గుంటూరుకు 9.45 గంటకు, ఒంగోలుకు 11.09 గంటలకు, నెల్లూరుకు 12.29 గంటలకు చేరుతుంది.
అక్కడి నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుపతికి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతిలో మధ్నాహ్నం 3.15 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.20 గంటలకు నెల్లూరు, 6.30 గంటలకు గుంటూరు 7.45 గంటలకు నల్గొండకు, రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుతుంది.
సికింద్రాబాద్ – తిరుపతి మధ్య కేవలం నాలుగు స్టేషన్లతో మాత్రమే రైలు ఆగనున్నది. 8న ప్రధాని మోదీ సికింద్రాబాద్ – తిరుపతి వందేభారత్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ – తిరుపతి వందేభారత్ వందేభారత్ రైలులో ఎగ్జిక్యూటివ్ చైర్ కారు ధర రూ.2వేలు పైగా ఉండే అవకాశాలున్నాయి.
ఏసీ చైర్ కారు రూ.1150గా ఉంటుందని సమాచారం. టికెట్ ధరలతో పాటు రైలు నెంబర్‌ను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. త్వరలోనే సికింద్రాబాద్ – పూణే, కాచిగూడ – బెంగళూరు మధ్య సైతం వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తున్నది.