ఆ హీరోయిన్‌తో శేఖర్ మాస్టర్‌కి ఎఫైర్ .. బయటపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్

సెలబ్రిటీలకి సంబంధించిన వార్తలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంటాయి. ఈ మధ్య పలు కార్యక్రమాలలో షో టీఆర్పీ పెంచడానికి విచిత్ర ప్రయోగాలు చేస్తూ సెలబ్రిటీల సీక్రెట్‌లని బయట పెడుతూ వస్తున్నారు. తాజాగా శేఖర్ మాస్టర్‌కి ఆ హీరోయిన్‌తో ఎఫైర్ అంటూ ఓ ప్రోమో వదిలారు. ఇది చూసిన వారు షాక్ అవుతున్నారు. శేఖర్ మాస్టర్ ప్రస్తుతం తెలుగులో టాప్ డాన్సు మాస్టర్‌గా ఓ వెలుగు వెలుగుతున్నారు. ఆయన కొరియోగ్రాఫర్‌గా స్టార్ హీరోలతోను పని చేస్తున్నాడు. అలానే పలు టీవీ షోలకి కూడా జడ్జ్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఆయన కొన్నాళ్లుగా ఢీ డ్యాన్స్ షోకి జడ్జిగా వ్యవహరిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం.
ప్రస్తుతం ఈ షోకి శేఖర్ మాస్టర్ తో పాటు , హీరోయిన్ ప్రణీత జడ్జ్ లుగా ఉన్నారు.అయితే షోలో శేఖర్ మాస్టర్ పర్సనల్ విషయాలు బయటకు రావడం హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా, ఆందులో సెలబ్రిటీలు, బిగ్ బాస్ కంటెస్టెంట్లు, ఇతర చిన్న పాటి సెలబ్రిటీలు డాన్సులు చేసారు. చివర్లో యాంకర్, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ శివ వచ్చాడు. తను మైక్ తీసుకుని మాట్లాడుతూ, సడెన్‌గా శేఖర్ మాస్టర్ ఎఫైర్ విషయం బయటపెట్టాడు. ఆయనపై సంచలన ఆరోపణలు చేశాడు. మొదట సింపుల్‌గా ఓ ప్రశ్న అడుగుతాను మాస్టర్ అంటూ స్టార్ట్ చేసిన శివ, `మీకు ఓ హీరోయిన్‌తో ఎఫైర్ ఉందని బయట రూమర్స్ నడుస్తున్నాయి అని అన్నాడు.
అప్పుడు శేఖర్ మాస్టర్ ఒక్కసారి ఫైర్ అవుతూ.. ఏ ఎవర్రా వీడిని ఇక్కడికి తీసుకొచ్చింద అని అన్నాడు.దాంతో షోలో ఉన్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే శేఖర్ మాస్టర్‌ని చాలా మంది సర్ధి చెప్పేందుకు ప్రయత్నించగా, ఆయన వినలేదు. శివపై నోరు మూసుకో ఇంకేం మాట్లాడొద్దు నువ్వు.. నాకో ఫ్యామిలీ ఉంది. పిల్లలున్నారు` అంటూ మండిపడ్డాడు. అంతేకాదు అతన్ని పంపిస్తారా? నన్ను వెళ్లిపోమ్మంటారా? అంటూ చాలా సీరియస్ అయ్యాడు. శివ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిన కూడా మాస్టర్ వినలేదు. కొద్ది సేపు షో నుండి ఆయనే బయటకు వెళ్లి పోయారు. మరి ఇది నిజమేనా, లేకుంటే టీఆర్పీలో భాగంగా ఆడిన డ్రామానా అని జనాలు ముచ్చటించుకుంటున్నారు.దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే 27న ప్రసారం కానున్న ఫుల్ ఎపిసోడ్ కోసం ఎదురు చూడాల్సిందే.