ఆడపిల్లవి జాగ్రత్తగా ఉండూ అంటూ శోభపై ఫుల్ సీరియస్ అయిన శివాజి

బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో హౌజ్‌మేట్స్ మధ్య గొడవలు పీక్స్‌కి వెళుతున్నాయి. ఫినాలేకి అంబటి అర్జున్ ఇప్పటికే చేరుకోగా, అతడు తప్ప ఈ వారంలో మిగిలిన ఆరుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎవరు ఫినాలే వీక్‌కి వెళతారు అనే ఆసక్తి అందరిలో ఉంది. అయితే తాజా ఎపిసోడ్‌లో శివాజీ, శోభాశెట్టిలకు మధ్య వాదన కాస్త గట్టిగానే జరిగింది. బాల్ గేమ్ టాస్క్‌తో తాజా ఎపిసోడ్ మొదలు కాగా, ఈ గేమ్ లో శోభ ముందుగా ఎలిమినేట్ అయింది. ఇక ఆమెని సంచాలకురాలిగా నియమించారు బిగ్ బాస్.
అయితే శోభ.. ప్రశాంత్, యావర్ లైన్ దాటారని, వారు ఎలిమినేట్ అయ్యారని శోభ ప్రకటించింది. దాంతో శివాజీ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో శివాజీని సర్ అంటూనే ఆయనతో చాలా సర్కాస్టిక్ గా మాట్లాడింది శోభ. అయితే శోభ తీరు నచ్చక శివాజీ ఆట నుండి తప్పుకున్నాడు. మరో సంచాలక్‌గా ఉన్న యావర్.. శివాజీని ఆడమని బ్రతిమిలాడిన ఆడలేదు. ఆ సమయంలో శివాజి, శోభ మధ్య కొంత డిస్కషన్ నడిచింది. దీంతో మీలా నటించడం లేదని, ఎటు కెమెరాలు ఉన్నాయో చూసి మరీ యాక్టింగ్ చేస్తున్నారంటూ శివాజీ పై అరిచింది శోభా. దీంతో ఆడపిల్లవి అడ్వాంటేజ్ తీసుకోవద్దని శివాజీ అనగా, అందుకు శోభ కూడా స్ట్రాంగ్ కామెంట్స్ చేసింది.. మొత్తం మీద ఇద్దరి మధ్య గొడవ కాస్త గట్టిగానే జరిగినట్లుగా తెలుస్తోంది.
ఇక ఇంటి పనుల విషయంలో ఈ రెండు రోజులు శోభ, ప్రియాంకలను వంట చేయమని చెప్పు, మిగతా పనులు మేము చేసుకుంటాం అని అర్జున్ అమర్ తో చెప్పాడు. ఇదే విషయం ప్రియాంక, శోభలకు చెప్పగా వారు మేము చేయము అన్నారు. తర్వాత కెప్టెన్ చెప్పాడు కాబట్టి చేస్తాం అన్నట్టు మాట్లాడారు. అయితే వీరి తీరు చూసిన శివాజి రేపు పెళ్లి అయ్యాక వీరు ఎలా అడ్జస్ట్ అవుతారు. ఇలాంటి బిహేవియర్ తో అత్తింట్లో ఎలా రాణిస్తారని అర్థంలో మాట్లాడాడు. ఇక అమర్ దీప్ కెప్టెన్సీ విషయంలోను కామెంట్ చేశాడు. ఇక ప్రశాంత్ మాట్లాడుతూ… నేనంటే అమర్ కి ఎందుకంత కోపం, మొదటి నుండి అనే అని ప్రశాంత్ అన్నాడు. అది కోపం కాదురా భయం అని శివాజీ అన్నాడు. అమర్ కెప్టెన్ అయినప్పటికీ ప్రియాంక, శోభ అతడికి ఆర్డర్స్ వేస్తున్నారని అర్జున్ అన్నాడు.