ప‌ల్ల‌వి ప్ర‌శాంత్‌కి మ‌ద్ద‌తు ఇవ్వ‌డంపై ఓపెన్ అయిన శివాజి..!

ప‌ల్ల‌వి ప్ర‌శాంత్‌కి మ‌ద్ద‌తు ఇవ్వ‌డంపై ఓపెన్ అయిన శివాజి..!

న‌టుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ శివాజి సీజ‌న్ 7 విన్న‌ర్ అవుతాడ‌ని అంద‌రు అనుకున్నారు. కాని లెక్క‌లు మారాయి. సామాన్యుడిగా వ‌చ్చిన ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ క‌ప్ అందుకున్నాడు. అయితే హౌజ్‌లోకి వ‌చ్చినప్ప‌టి నుండి ప్ర‌శాంత్‌ని వెన‌క ఉండి న‌డిపించింది శివాజి అని చెప్పాలి. ఈ క్ర‌మంలో పల్ల‌వి ప్ర‌శాంత్ క‌ప్ గెలుచుకొని వెళ్ల‌గా, నటుడు అమర్‌ దీప్‌ రన్నరప్‌గా నిలిచాడు, సీనియర్‌ నటుడు శివాజీ మూడో ప్లేస్‌తో సరిపెట్టుకున్నాడు. ఇక బిగ్ బాస్ హౌజ్‌లో కొంద‌రు కంటెస్టెంట్స్ రెండు గ్రూపులుగా విడిపోయి గేమ్ ఆడారు. శివాజీ, ప్రిన్స్‌ యావర్‌, పల్లవి ప్రశాంత్‌లతో స్పై బ్యాచ్‌, శోభా శెట్టి, ప్రియాంక జైన్‌, అమర్‌ దీప్ స్పా బ్యాచ్‌గా ఉండి గేమ్ ఆడారు.

అయితే స్పా బ్యాచ్ ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ ఆధిప‌త్యాన్ని చూపించే ప్ర‌య‌త్నం చేసిన శివాజి వారికి చెక్ పెట్టేశాడు. ముఖ్యంగా హౌజ్‌లో రైతు బిడ్డ‌కు అండ‌గా ఉన్నాడు. అత‌ను లోగా ఉన్న‌ప్పుడు ఎంకరేజ్ చేశాడు. శివాజి చివరలో ఎలిమినేట్ అయి వెళుతున్న‌ప్పుడు కాళ్ల మీద ప‌డి వెళ్లొద్దు అని వేడుకున్నాడు. అయితే ప్ర‌శాంత్‌ని అంత ఇన్ఫ్లూయెన్స్ చేసిన శివాజీ గురించి బ‌య‌ట ర‌క‌రకాలుగా ముచ్చ‌టించుకుంటున్నారు. ఈ క్ర‌మంలో శివాజి తాజాగా పల్లవి ప్రశాంత్‌కు సపోర్టు చేయడానికి గల కారణాలను అందరితో పంచుకున్నాడు. ప‌ల్లవి ప్రశాంత్‌ చాలా అమాయకుడు అని అత‌నికి సోష‌ల్ మీడియాను ఎలా వినియోగించుకోవాలో కూడా తెలియ‌దు అని శివాజి అన్నాడు.

ప్రశాంత్‌కు యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ల కొద్దీ సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నా కూడా వాటి ద్వారా డ‌బ్బులు వ‌స్తాయ‌న్న విష‌యం కూడా తెలియ‌దు. సోష‌ల్ మీడియా మేనేజ‌ర్ లేడు. హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాక వాడి సోషల్‌ మీడియా ఛానెల్స్‌ను నేను మానిటైజేషన్‌ చేయించాను. చాలామంది ప్రశాంత్‌కు రెండు ఫేస్‌లు ఉన్నాయంటారు. కాని అన్ని తెలివితేట‌లే ఉండి ఉంటే త‌న ఫాలోవర్స్‌ని ఉప‌యోగించి ల‌క్ష‌లు సంపాదించుకునేవాడు. నిజ‌మైన కామ‌న్‌మెన్ అంటే ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ అని నాకు అర్ధమైంది. చాలా హానెస్ట్‌గా కనిపించ‌డం వ‌ల‌న అత‌డికి అండ‌గా ఉన్నాను అని శివాజి చెప్పుకురాగా, అత‌ని వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి.