బిగ్ బాస్ విన్న‌ర్ క‌న్నా శివాజి రెమ్యున‌రేష‌న్.. మేట‌ర్ లీక్ చేశాడుగా..!

  • By: sn    breaking    Jan 03, 2024 12:52 PM IST
బిగ్ బాస్ విన్న‌ర్ క‌న్నా శివాజి రెమ్యున‌రేష‌న్.. మేట‌ర్ లీక్ చేశాడుగా..!

బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో ఇటీవ‌ల తెలుగులో ఏడో సీజ‌న్ పూర్తి చేసుకుంది. ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్‌తో సాగిన ఈ షో ప్రేక్ష‌కులకి మంచి వినోద‌మే పంచింది. ఇక ఫినాలే ఎపిసోడ్‌కి అయితే ఎప్పుడు రానంత టీఆర్పీ రేటింగ్ ద‌క్కింది. మ‌రోవైపు సీజ‌న్ 7లో కామ‌న్ మెన్ ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ విన్న‌ర్ కావ‌డం, ఆయ‌న గెలిచాక బ‌య‌ట ర‌చ్చ చేయ‌డం దాంతో ఆయ‌న‌ని మూడు రోజుల పాటు చంచ‌ల్ గూడ జైల్లో వేయ‌డం ఇలా పలు విష‌యాల‌తో సీజ‌న్ 7 హాట్ టాపిక్ అయింది. సీజ‌న్ 7లో అమర్ దీప్ రన్నర్ గా నిలిచాడు. శివాజీ సెకండ్ రన్నర్ గా ఉన్నాడు. ప్రిన్స్ యావర్ రూ. 15 లక్షలు తీసుకుని నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ప్రియాంక జైన్ 5వ స్థానం, అర్జున్ ఆరవ స్థానంలో ఉన్నారు.

మొద‌టి నుండి శివాజీనే విన్న‌ర్ అవుతాడంటూ జోరుగా ప్ర‌చారాలు సాగాయి. అయితే షో చివరి వారాల‌లో శివాజి నోరు అదుపు చేసుకోలేక కొన్ని త‌ప్పుడు వ్యాఖ్య‌లు చేశారు.శోభా శెట్టిని పీక మీద కాలేసి తొక్కుతా అని చెప్ప‌డం, ఆ విష‌యంలో నాగార్జున ఫుల్ క్లాస్ పీక‌డం ఆయ‌న‌కి కాస్త నెగెటివిటీ అయింది. అదే స‌మ‌యంలో పల్లవి ప్రశాంత్ తన గేమ్ తో విపరీతమైన ఫాలోయింగ్ రాబట్ట‌డంతో విన్న‌ర్ అయ్యాడు. అయితే హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాక బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేస్తున్నారు. ముఖ్యంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న శివాజీ పలు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నాడు. పల్లవి ప్రశాంత్ చాలా మంచోడు అని, ఆయ‌న‌ అమాయకుడు కూడా అని తెలిపాడు. అతని సోషల్ మీడియా అకౌంట్స్ కి, యూట్యూబ్ ఛానల్ కి లక్షల మంది ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ ఉండ‌గా, వాటిని మానిటైజ్ చేయించుకుంటే డబ్బులు వస్తాయని కూడా తెలియదు..

నెలకు రూ. 10 లక్షల వరకు లాస్ అయ్యాడు. నేను అతని అకౌంట్స్ మానిటైజ్ చేయించాను అని పేర్కొన్నాడు. ఇక బిగ్ బాస్ హౌజ్‌లో త‌న రెమ్యూనరేషన్ గురించి మాట్లాడిన శివాజి… పల్లవి ప్రశాంత్ కంటే నాకే ఎక్కువ డబ్బులు వచ్చాయి, అన్నాడు. విన్నర్ ప్రైజ్‌ మనీ కంటే తన రెమ్యూనరేషన్ ఎక్కువని శివాజీ చెప్పకనే చెప్పాడు.అత‌నికి వారానికి రూ. 4 లక్షల ఒప్పందంపై హౌసులో అడుగుపెట్టిన‌ట్టు తెలుస్తుండ‌గా, ఆ లెక్కన 15 వారాలకు రూ. 60 లక్షలు రూపాయలు అందుకున్న‌ట్టు స‌మాచారం. ఇక చివ‌రి వారాల‌లో త‌న‌ని నెగెటివ్‌గా చూపించార‌ని, దాని వ‌ల్ల‌నే విన్న‌ర్ కాలేక‌పోయిన‌ట్టు కూడా తెలియ‌జేశాడు శివాజి.